Begin typing your search above and press return to search.

అంబానీ కోడ‌లు సోద‌రి హెయిర్ సెలూన్ ఓన‌ర్?

ఈ వేడుక‌ల్లో కాబోయే వ‌ధువు రాధికతో పాటు ఆమె సోదరి అంజలి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది

By:  Tupaki Desk   |   4 March 2024 5:38 AM GMT
అంబానీ కోడ‌లు సోద‌రి హెయిర్ సెలూన్ ఓన‌ర్?
X

ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుక‌లు చాలా కోలాహలంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒకరితో ఒకరు ఘాఢంగా ప్రేమలో ఉన్న ఈ జంట జ‌నవరి 2023లో ముంబైలోని యాంటిలియా మాన్షన్‌లో తమ నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. అప్ప‌టి నుంచి ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 12 జూలై 2024న పెళ్లికి సిద్ధమవుతున్నందున, అనంత్ -రాధికకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1, మార్చి 2, మార్చి 3న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్లాన్ చేసారు. ఈ వేడుక‌ల్లో కాబోయే వ‌ధువు రాధికతో పాటు ఆమె సోదరి అంజలి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అంబానీల కోడ‌లు సోద‌రి గురించి ఎవ‌రికెంత తెలుసు? అంటే తెలుసుకోవాల్సింది చాలానే ఉంది.

అంజలి రాధిక మాదిరిగానే వ్యాపార యజమానుల కుటుంబం నుండి వచ్చినప్పటికీ తన సొంత వ్యాపారాన్ని నడుపుతున్న ఒక స్వావలంబన కలిగిన యువతి. అంజలి వ్యాపారవేత్తగా సాహ‌సోపేత‌మైన ప్ర‌యాణం సాగిస్తోంది. గుజరాత్‌లోని కచ్ అంజలి స్వస్థలం. ఆమె 1989లో ముంబైలో జన్మించింది. అంజలి మర్చంట్ విద్యాభ్యాస సమయంలో ది కేథడ్రల్ , జాన్ కానన్ స్కూల్‌లో చదివారు. ఆమె వీరేన్ - శైలా మర్చంట్‌ల పెద్ద కుమార్తె. ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో ఆమె తర్వాత చదువుకున్నారు. తన విద్యను పూర్తి చేసిన తర్వాత, అంజలి స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో బీఎస్సీ పూర్తి చేయ‌డానికి బాబ్సన్ కాలేజీకి వెళ్లింది.

గ్రాడ్యుయేషన్ తర్వాత తన MBA పొందేందుకు అంజలి లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరింది. అటుపై అంజలి 2010లో ఒక సెమిస్టర్ కోసం వర్జీనియా విశ్వవిద్యాలయంలో విదేశాలలో చదువుకుంది. తన సెమిస్టర్ ఎట్ సీ సమయంలో అంజలి పన్నెండు వేర్వేరు దేశాలను సందర్శించింది. కెనడా, స్పెయిన్, మొరాకో, ఘనా, చైనా, జపాన్ స‌హా ఇతర ప్రదేశాలలో ప్రాజెక్ట్‌లపై పని చేసింది.

2006లో అంజలి పబ్లిసిస్‌లో అడ్వర్టైజింగ్‌ ఇంటర్న్‌గా తన జ‌ర్నీని ప్రారంభించింది. 2009లో మెర్క్‌లో ఇంటర్న్‌గా పనిచేసింది. 2012లో అంజలి తన తండ్రి కంపెనీ అయిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేయడం ప్రారంభించింది. అంజలి 2017లో బేయర్‌లో ప‌ని చేసాక‌ 2021లో మళ్లీ శిక్షణ పొందింది. అంజలి మైలోన్ మెటల్స్ అండ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అంజలి 'టర్న్ ది క్యాంపస్' సహ-స్థాపకురాలు. ఇది మైలాన్ స్టీల్స్ ..త‌న‌ కుటుంబ వ్యాపారానికి డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు, కళాశాల విద్యార్థులు ఉద్యోగుల కోసం ఉద్దేశించిన ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్. కానీ 2012లో వ్యాపారం చేయడం మానేసింది. 2018లో అంజలి ప్రత్యేకమైన హెయిర్ సర్వీస్‌లను అందించడంలో ప్రత్యేకత కలిగిన హెయిర్ సెలూన్‌ల నెట్‌వర్క్ అయిన డ్రైఫిక్స్‌కి సహ వ్యవస్థాపకురాలుగా మారింది. టబు, అలియా భట్‌ సహా అనేక మంది బి-టౌన్ ప్రముఖులు దీనికి ప్ర‌చారం చేస్తున్నారు.