Begin typing your search above and press return to search.

అప్పుడే అంకుల్ అనేస్తే ఎలా పెళ్లి కూతురా?

తాజాగా అంబానీ ఇంట కాబోయే కొత్త కోడ‌లు రాధిక మ‌ర్చంట్ అంటూ ఓ స్టార్ హీరోని అంకుల్ అంటూ సంబోధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   8 March 2024 11:30 PM GMT
అప్పుడే అంకుల్ అనేస్తే ఎలా పెళ్లి కూతురా?
X

అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఎంత వైభ‌వంగా జరిగిందో తెలిసిందే. అతిర‌ధ మ‌హార‌ధుల స‌మ‌క్షంలో ఎంతో గ్రాండ్ గా మూడు రోజుల ఈవెంట్ ముగిసింది. ఆ ఫోటోలు నెట్టింట అంతే వైర‌ల్ అయ్యాయి. ఎవ‌రూ... ఏ ఫోటో తీసేయ‌ని పిక్ కాద‌నిపించింది. అంతా జీవితంలో క‌ష్ట‌పడి పైకొచ్చిన లెజెండ్లే ఒకేచోట కొలువు దీరారు. ఒక్కోక్క‌రు ఒక్కో రంగంలో అద్భుతాలు సృష్టించ‌ని లెజెండ్స్.

తాజాగా అంబానీ ఇంట కాబోయే కొత్త కోడ‌లు రాధిక మ‌ర్చంట్ అంటూ ఓ స్టార్ హీరోని అంకుల్ అంటూ సంబోధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ స్టార్ ఎవ‌రో కాదు...బాద్ షా షారుక్ ఖాన్ నే రాధిక అంకుల్ అన్నారు. 'మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి 'ఆజ్ ఆప్కీ' సినిమా కా ఏక్ డైలాగ్ బోల్ దేతి హున్ (నేను మీ సినిమాలోని ఒక డైలాగ్ చెబుతాను)' అని ఆమె అంటుంది.

'అగర్ అక్షయ్ హోతా తో అక్షయ్ కుమార్ కీ ఫిల్మ్ కా బోల్టీ (అక్షయ్ ఇక్కడ ఉంటే, మీరు అతని సినిమాలోని ఒక డైలాగ్ చెప్పేవారు) అని షారుఖ్ జోక్ చేశాడు. అప్పుడు రాధిక షారుఖ్ ఖాన్ ఐకానిక్ డైలాగులలో ఒకటైన 'జిత్నీ షిద్దాత్ సే మైనే తుమ్హే పానే కి కోషిష్ కీ హై.. జర్రే జరే నే ముజే తుమ్సే మిలానే కి కోషి కీ హై' అని చెప్పింది. ఇలా షారుక్ డైలాగ్ రాధిక నోట రావ‌డంతో అది వైర‌ల్ గా మారింది.

దీంతో నెటి జ‌నులు అంబానీ కోడ‌లిపై కామెంట్లు షురూ చేసారు. అంబానీ కోడ‌లు అప్పుడే వ‌రుస‌లు క‌లిపేస్తుంది. క‌లుపుగోలు కోడ‌లు అనుకుం టా? అంటూ ఎవ‌రి స్టైల్లో వారు పోస్ట్ లు పెడుతున్నారు. అనంత్ అంబానీతో రాధిక వివాహం జులైలో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ప్రీ వెడ్డింగ్ కోస‌మే 1200 కోట్లు ఖ‌ర్చు చేసారు. 2500 ర‌కాల వంట‌కాల‌తో అబ్బుర ప‌రిచారు. మ‌రి వివాహం రోజు అతిధుల‌కు ఇంకెన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉంటాయో చూడాలి.