Begin typing your search above and press return to search.

'ల‌స్ట్ స్టోరీస్ 3' చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయం

ల‌స్ట్ స్టోరీస్ మొదటి భాగం 2018 లో, ల‌స్ట్ స్టోరిస్ రెండో భాగం 2023 లో విడుదల‌య్యాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్ కార‌ణంగా పెద్ద స‌క్సెసైంది.

By:  Tupaki Desk   |   5 May 2025 3:48 PM
Radika Apte Shines Again in Lust Stories 3
X

ల‌స్ట్ స్టోరీస్ మొదటి భాగం 2018 లో, ల‌స్ట్ స్టోరిస్ రెండో భాగం 2023 లో విడుదల‌య్యాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్ కార‌ణంగా పెద్ద స‌క్సెసైంది. రాధిక ఆప్టే మొద‌టి నుంచి నెట్ ఫ్లిక్స్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న న‌టి. బోల్డ్ సిరీస్ మొద‌టి భాగంలో టూమచ్ గా ఘాటైన స‌న్నిశాల్లో న‌టించిన రాధిక ఈ సిరీస్ కి వ‌న్నె తెచ్చింది. అందుకే ఇప్పుడు ఫ్రాంఛైజీ మూడో భాగంలో రాధిక న‌టిస్తోంద‌ని తెలియ‌గానే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మ‌రోసారి గ్లామ్ ట్రీట్ కి కొద‌వేమీ ఉండ‌ద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

తాజాగా పీపింగ్‌మూన్ క‌థ‌నం ప్రకారం.. `లస్ట్ స్టోరీస్ 3`కి ముగ్గురు ద‌ర్శ‌కులు ప‌ని చేస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీలో ఒక ఎపిసోడ్ కి విక్రమాదిత్య మోత్వానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, ఈ ఎపిసోడ్ లో రాధికా ఆప్టే తెర‌పై క‌న్నుల‌పండ‌గ చేయ‌నుంది. ఇత‌ర భాగాల‌కు శకున్ బాత్రా, కిరణ్ రావు దర్శకత్వం వహిస్తున్నార‌ని స‌మాచారం. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి భాగంలో అనురాగ్ కశ్యప్ విభాగంలో ఆప్టే న‌టించింది. తర్వాత రాధిక ఆప్టే లస్ట్ స్టోరీస్ 3 కోసం తిరిగి ఫ్రాంఛైజీలో చేరింది. ఈ సంవత్సరం చివర్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.

నెట్ ఫ్లిక్స్ తో సుదీర్ఘ అనుబంధం కొన‌సాగిస్తున్న రాధిక ఆప్టే ఇదే ఓటీటీ కోసం మరో రెండు ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది.

ల‌స్టో స్టోరీస్ సిరీస్ లో గ‌త రెండు భాగాలను ప‌రిశీలిస్తే.. నీనా గుప్తా, కాజోల్, కొంకోన సేన్ శర్మ, విజయ్ వర్మ, భూమి పెడ్నేకర్ త‌దిత‌రులు ఫ్రాంచైజీలో భాగమయ్యారు. రాధిక ఇత‌ర ప్రాజెక్టుల వివ‌రాల్లోకి వెళితే.. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ క్రైమ్ డ్రామా సిరీస్ `అక్కా`, కీర్తి సురేష్ - నవాజుద్దీన్ సిద్ధిఖీ ల‌తో క‌లిసి `రాత్ అకేలి హై 2` చిత్రాల్లోను రాధిక న‌టిస్తోంది. ఇవే కాదు.. టిస్కా చోప్రా దర్శకత్వం వహించిన తొలి చిత్రం `సాలీ మొహబ్బత్‌`లో కూడా ఆప్టే కనిపిస్తుంది. ల‌స్ట్ స్టోరీస్ 3కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఇత‌ర భాగాల న‌టుల గురించి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.