Begin typing your search above and press return to search.

అమ్మ క‌ల‌కు ప్ర‌తిరూపంగా సాయిప‌ల్ల‌వి!

సాయిపల్లవి కేవలం నటి మాత్రమే కాదు. వెండితెరపై నాట్యం చేసే ఓ కావ్యం. ఆమె డాన్స్‌లో ఉండే గ్రేస్, వేగం , ఎమోషన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

By:  Srikanth Kontham   |   12 March 2026 5:00 PM IST
అమ్మ క‌ల‌కు ప్ర‌తిరూపంగా సాయిప‌ల్ల‌వి!
X

సాయిపల్లవి కేవలం నటి మాత్రమే కాదు. వెండితెరపై నాట్యం చేసే ఓ కావ్యం. ఆమె డాన్స్‌లో ఉండే గ్రేస్, వేగం , ఎమోషన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే, సాయిపల్లవి ఇంత గొప్ప డాన్సర్ కావడానికి గల పునాది ఆమె ఇంట్లోనే పడింది. ఆమె తల్లి రాధా మణి స్వయంగా గొప్ప నాట్య కళాకారిణి కావడమే సాయిపల్లవి లోని కళాకారిణి మేల్కొనడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సాయిపల్లవి బాల్యం నుండే నాట్య వాతావరణంలో పెరిగారు. ఆమె తల్లికి నాట్యం పట్ల ఉన్న మక్కువ, సాధనను సాయిపల్లవి చిన్నప్పటి నుండి గమనిస్తూ వచ్చారు.

తల్లి శిక్షణలో సాయిప‌ల్ల‌వి నాట్యంలోని మెళకువలను నేర్చుకోవడం వల్ల అమ్మ‌డికి ల‌య‌, అభినయంపై చిన్న వయసులోనే పట్టు సంపాదించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు నాట్యం అనేది వారసత్వంగా అందిన అపురూపమైన కానుక. చాలామంది డాన్సర్లు కేవలం స్టెప్పులను మాత్ర‌మే అనుకరిస్తారు. కానీ సాయి పల్లవి ఆ స్టెప్పుల వెనుక ఉండే ఎమోషన్‌ను పండిస్తారు. దీనికి కారణం ఆమె తల్లి ఇచ్చిన సంస్కారవంతమైన శిక్షణే. శాస్త్రీయ నృత్యంలో ఉండే క్రమశిక్షణ, ముద్రలు కళ్ళతో పలికించే భావాలు ఆమె తల్లి ద్వారానే సాయిపల్లవికి అలవడ్డాయి.

అందుకే సాయిప‌ల్ల‌వి వెస్ట్రన్ డాన్స్ చేసినా, ఫోక్ డాన్స్ చేసినా అందులో ఒక తెలియని క్లాసికల్ టచ్ కనిపిస్తుంది.సినిమాల్లో రానించాలంటే కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహం అంతే కీల‌కం. ఆ విష‌యంలో సాయి ప‌ల్ల‌వికి మామ్ నుంచి తొలి నుంచి ద‌క్కుతుంది. సాయిపల్లవి డాక్ట‌ర్ చ‌దివిన‌ప్ప‌టికీ, ఆమెలోని డాన్సర్‌ను నిరంతరం ప్రోత్స హించింది తల్లే. `ఢీ` వంటి డ్యాన్స్ షోలలో పాల్గొన్నప్పుడు కూడా ఆమె వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఇచ్చారు.త‌ల్లి అభిరుచుని గుర్తించిన కుమార్తె చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎద‌గ‌డానికి ఎంతో శ్ర‌మించారు.

త‌ల్లి సాధించ‌లేనిది తాను సాధించి ఆ విజ‌యాన్ని త‌ల్లికి బ‌హుమ‌తిగా ఇవ్వాల‌నుకున్నారు. ఆ ర‌కంగా త‌ల్లి పేరును సాయి ప‌ల్ల‌వి నిల‌బెట్టింద‌ని చెప్పొచ్చు. ప్రతి సినిమాలోనూ త‌న‌ డ్యాన్స్‌తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడం సాయి పల్ల‌వి ప్ర‌త్యేక‌త‌. సాయిపల్లవి గొప్ప డాన్సర్ కావడంలో ఆమె కృషి ఎంత ఉందో? ఆ కృషికి మార్గం చూపిన ఆమె తల్లి రాధా మణి పాత్ర అంత‌కు మించే. డాన్స‌ర్ గా ఎంత గొప్ప స్థానంలో ఉందో? న‌టిగానూ అంతే స‌క్సెస్ అయింది. ఇప్ప‌టికే ద‌క్షిణాదిన అన్నిభాష‌ల్లోనూ సినిమాలు చేసింది. ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `రామాయ‌ణం` తో బాలీవుడ్ లోనూ అడుగు పెడుగు పెడుతుంది. ఇందులో సీత‌మ్మ పాత్ర‌లో యావ‌త్ భార‌తాన్ని అల‌రించ‌నున్నారు.