Begin typing your search above and press return to search.

అందాల రాశి అవకాశం సద్వినియోగం చేసుకుందా?

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

By:  Tupaki Desk   |   15 March 2024 8:16 AM GMT
అందాల రాశి అవకాశం సద్వినియోగం చేసుకుందా?
X

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అమ్మడు తెలుగు లో పలువురు యంగ్‌ హీరోలతో నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

ఇదే సమయంలో బాలీవుడ్‌ లో ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడికి అవకాశాలు దక్కాయి. తాజాగా సిద్దార్థ్‌ మల్హోత్రా హీరోగా రూపొందిన యోధ సినిమాలో రాశి ఖన్నా నటించింది. నేడు యోధ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యోధ సినిమా ఫలితం పై ఆధారపడి రాశి ఖన్నా హిందీ కెరీర్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గత వారం పది రోజులుగా యోధ సినిమా కోసం సిద్దార్థ్‌ మల్హోత్ర తో కలిసి ఉత్తర భారతంలో ప్రమోషన్ కోసం పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ సమయంలో యోధ సినిమా పై రాశి ఖన్నా చాలా నమ్మకం ను వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తర్వాత హిందీలో చేసిన సినిమా అంటూ కూడా ఆమె ప్రచారం చేసింది.

బాలీవుడ్ లో యంగ్‌ స్టార్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా తో నటించే అవకాశం ను దక్కించుకున్న ఈ అమ్మడికి సక్సెస్ దక్కి మరిన్ని ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. బాలీవుడ్‌ లో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.