Begin typing your search above and press return to search.

అందాల రాశి య‌వ్వ‌న శిరులు

ఇంత‌లోనే రాశీ ఖ‌న్నా రెడ్ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. యోధ ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు విచ్చేసిన రాశీ రెడ్ హాట్ ఫ్రాక్‌లో సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా మారింది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 5:23 PM GMT
అందాల రాశి య‌వ్వ‌న శిరులు
X

రాశి ఖన్నా న‌టించిన 'యోధా' మార్చిలో విడుద‌ల‌కు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన క‌థానాయిక‌గా నటించింది. ప్ర‌స్తుతం రాశీ యోధ ప్ర‌చారంలో బిజీగా ఉంది.

ఇంత‌లోనే రాశీ ఖ‌న్నా రెడ్ హాట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. యోధ ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు విచ్చేసిన రాశీ రెడ్ హాట్ ఫ్రాక్‌లో సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. రాశీ మ‌చ్చ లేని సౌంద‌ర్యం అభిమానుల‌ను మంతృముగ్ధుల‌ను చేస్తోంది. ఇంత‌కుముందు నీలి రంగు ఫ్రాక్ లో క‌నిపించిన రాశీ ఇప్పుడు ఎరుపు రంగు ప్రాక్ లో అంత‌కుమించి బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

యోధా కోసం ఎదురుచూపులు పెరుగుతున్నాయ‌న‌డానికి రాశీ ఈ లుక్ స‌రిపోతుంది. ఆకర్షణీయమైన ప్రమోషనల్ లుక్‌తో అందాల రాశీ ఆజ్యం పోసింది. సౌందర్యంలో రాశీ రిచ్ అండ్ డైన‌మిక్ అని ప్ర‌శంసించాలి. ఇటీవల యోధా ప్రమోషన్స్ లో సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో చేతులు క‌లిపి ప్రేమ‌గా ఉన్న వీడియో సోషల్ మీడియా సంచ‌ల‌నానికి దారితీసింది. వారాంతంలో సిద్ధార్థ్ - రాశి జైపూర్‌లో కనిపించారు, అక్కడ వారు జిందగీ తేరే నామ్ పేరుతో యోధా ప్రారంభ పాటను విడుదల చేశారు. వారి పర్యటనలోని ఫోటోలు ఇంటర్నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా వీరిద్దరూ చేతులు పట్టుకున్న వీడియోతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

సిద్ధార్థ్ భార్య కియారా అద్వానీ అభిమానులు బహిరంగ కార్యక్రమంలో సిధ్ చేష్ట‌ల‌ను విమర్శించారు. యోధా ప్రచార కార్యక్రమాల్లో రాశీ తో అత‌డు ఎంతో స‌న్నిహితంగా క‌నిపించాడు. ఇది కియ‌రా అభిమానుల‌కు నచ్చ‌లేదు. సాగర్ ఆంబ్రే - పుష్కర్ ఓజా దర్శకత్వం వహించిన యోధా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించారు. సిద్ధార్థ్ మల్హోత్రా - రాశి ఖన్నాతో పాటు, ఈ చిత్రంలో దిశా పటాని కూడా నటించారు. మార్చి 15న థియేటర్లలోకి రానుంది.