Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా.. వ్వాటే లక్కు!

బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ తో ఎలాంటి సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ రాశీ ఖన్నా

By:  Tupaki Desk   |   16 April 2024 9:30 AM GMT
రాశి ఖన్నా.. వ్వాటే లక్కు!
X

బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ తో ఎలాంటి సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ రాశీ ఖన్నా. ఈ మధ్య కాలంలో రాశి.. బాలీవుడ్ లో తెగ సందడి చేస్తోంది. రుద్ర, ఫర్జీ వంటి వెబ్ సిరీసులతో పాటు యోధా మూవీలో యాక్ట్ చేసింది. తమిళంలో అరన్మణై-4, మేధావి చిత్రాలు చేస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన అరన్మణై-4 (తెలుగులో బాక్) థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఆ మధ్య తెలుగులో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలు చేసింది రాశీ ఖన్నా. ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. ప్రస్తుతం తెలుసు కదా మూవీ చేస్తోంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాశీ ఖన్నా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

అయితే రాశీ ఖన్నా మరో తెలుగు మూవీలో రీసెంట్ గా ఛాన్స్ కొట్టినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో రాశి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. భీష్మ తర్వాత మరోసారి నితిన్, వెంకీ కుడుముల కాంబోలో మూవీ వస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను మేకర్స్ ముందు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో శ్రీలీలనే రాబిన్ హుడ్ హీరోయిన్ గా పరోక్షంగా తెలిపారు. కానీ ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు శ్రీలీల ప్లేస్ లో రాశీ ఖన్నాను తీసుకున్నారా లేదా ఇద్దరూ నటిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇప్పటికే రాశీ ఖన్నా, నితిన్ కలిసి శ్రీనివాస కళ్యాణం మూవీ చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దిల్ రాజు కూడా ఈ మూవీ రిజల్ట్ విషయంలో తన అంచనాలు తప్పాయని ఇటీవల తెలిపారు. రాబిన్ హుడ్ లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి రాబిన్ హుడ్ సెట్స్ లోకి రాశీ ఖన్నా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.