Begin typing your search above and press return to search.

మ‌హేష్‌..బ‌న్నీ కోసం క‌ల‌లు కంటోన్న రాశీఖ‌న్నా!

టాలీవుడ్ లో వాళ్లిద్ద‌రితో పాటు బాలీవుడ్ లో షారుక్ ఖాన్..హృతిక్ రోష‌న్ ల‌తో కూడా సినిమాలు చేయాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 10:30 AM GMT
మ‌హేష్‌..బ‌న్నీ కోసం క‌ల‌లు కంటోన్న రాశీఖ‌న్నా!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క‌లిసి న‌టించాల‌ని ఏహీరోయిన్ కోరుకోదు. హీరోయిన్లు అంద‌రికీ వాళ్ల‌తో రొమాన్స్ చేయాల‌ని మ‌న‌సులో బ‌ల‌మైన కోరిక‌. కానీ ఆ ఛాన్స్ కొంద‌రికే వ‌స్తుంది. మ‌రి ఆ లిస్ట్ లో అందాల రాశీఖ‌న్నా చేరుతుందో లేదో ఆ పెరుమాళ్ల‌కే తెలియాలి మ‌రి. అవును మ‌హేష్‌..బ‌న్నీతో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌న్న కోరిక‌ను ఆమ్మ‌డు ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకుంది.

టాలీవుడ్ లో వాళ్లిద్ద‌రితో పాటు బాలీవుడ్ లో షారుక్ ఖాన్..హృతిక్ రోష‌న్ ల‌తో కూడా సినిమాలు చేయాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లు తెలిపింది. ఇక కోలీవుడ్ నుంచైతే విజ‌య్ పేరు చెప్పుకొచ్చింది. వీళ్లంద‌రితో మాత్రం ఇండస్ట్రీ నుంచి రిటైర్ మెంట్ తీసుకునే లోపు సినిమాలు చేసేయాలి అంటోంది. 'థాంక్యూ' తర్వాత రాశీఖ‌న్నా టాలీవుడ్ కి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి కోలీవుడ్..బాలీవుడ్ సినిమాల‌తోనే బిజీగా గ‌డుపుతుంది.

ఇప్పుడు పూర్తిగా హిందీ సినిమాలే అమ్మ‌డి జాబితాలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. 2024లో బ్యూటీ చాలా సినిమాలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. సిద్దార్ధ్ మ‌ల్హోత్రాకి జంట‌గా న‌టించిన 'యోధ' మార్చిలో రిలీజ్ అవుతుంది. 'టీఎమ్ ఈ' అనే చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే 'ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్' అనే సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది.

వాటి వివ‌రాలు ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇక త‌మిళ్ లో 'ఆర‌ణ్మ‌నై 4' లో న‌టించింది. ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే 'మేథావి' అనే మరో కోలీవుడ్ చిత్రం కూడా చేస్తుంది. ఇలా రాశీఖ‌ర్నా జ‌ర్నీ ముందుకు సాగుతుంది. వీట‌న్నింటితోనూ విజ‌యం అందుకుంట‌నే అమ్మ‌డు మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చేది. మ‌ళ్లీ తెలుగులో అవ‌కాశాలు రావ‌డానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే? టాలీవుడ్ లో కంబ్యాక్ అంత ఈజీ కాదు. అందులోనూ మ‌హేష్‌..బ‌న్నీ తో ఛాన్స్ అంత‌క‌న్నా సుల‌భం కాదు.