రూమ్ మేట్స్ అంటే ఇలా ఉండాలి
అయితే తాను ముంబైకి వచ్చినప్పుడల్లా వాణీ రూమ్ లో ఉండమనేది. అలా వాణీ- రాశీ స్నేహానుబంధం మరో లెవల్ కి వెళ్లింది.
By: Tupaki Desk | 20 May 2025 9:33 PM ISTఅసలు రూమ్ మేట్స్ అంటే ఎలా ఉండాలి? ఇదిగో ఇక్కడ వాణీ-రాశీలా ఉండాలి. ఒకరికోసం ఒకరుగా, ఒకరితో ఒకరుగా..! ఢిల్లీలో మోడలింగ్ అసైన్ మెంట్స్ లో కలిసారు. ఆ తరవాతా ఈ ఇద్దరూ తమ స్నేహాన్ని ముంబైలోను కొనసాగించారు. నిజానికి రాశీ దిల్లీలో ఉన్నప్పుడు మోడలింగ్ చేసేది. రాశీ ఖన్నా - వాణీ స్నేహం చిగురించింది ఇక్కడే. తాను మోడలింగ్ చేస్తూ తన ఏజెన్సీకి వాణీని కూడా పరిచయం చేస్తానని అంది. కానీ వాణీకి అస్సలు మోడలింగ్ ఇష్టం లేదు. సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. అందుకోసం వాణీ ముంబైకి వెళ్లింది. అయితే తాను ముంబైకి వచ్చినప్పుడల్లా వాణీ రూమ్ లో ఉండమనేది. అలా వాణీ- రాశీ స్నేహానుబంధం మరో లెవల్ కి వెళ్లింది.
ఆ తర్వాత విధి ఎంతో విచిత్రమైనది. వాణీ ముంబైలో రూమ్ లో ఉండేది. అక్కడికి రాశీ వెళ్లేది. తనను ఎప్పుడూ నటనలోకి రావాలని వాణీ ఎంకరేజ్ చేసేది. కానీ తనకు అస్సలు నటన ఇష్టం లేదు. అందువల్ల నటనలోకి వెళ్లలేదు. కానీ మద్రాస్ కేఫ్ దర్శకుడు తనను సంప్రదించారు. జాన్ అబ్రహాం లాంటి పెద్ద హీరో సినిమా కాబట్టి మూడో సారి పిలిచినప్పుడు కాదనలేక నటించానని తెలిపింది. అసలు తనకు నటన అప్పటికి ఇష్టం లేదని రాశీ చెప్పింది.
మేం ఎంత మంచి స్నేహితులం అయినా కానీ మేం దానిని బయటికి చెప్పుకోము అని రాశీ ఖన్నా అంది. ``మేము మంచి స్నేహితులం. హీరోయిన్లు స్నేహితులుగా ఉండలేరనే ఆలోచన అబద్ధం. ఇన్‌స్టాలో మా స్నేహాన్ని మేము ప్రచారం చేయనందున అలా అనిపిస్తుంది`` అని అంది. మద్రాస్ కేఫ్ లో నటించిన తర్వాత రాశీ ఖన్నాకు నేరుగా టాలీవుడ్ కి టికెట్ దొరికింది. అవసరాల శ్రీనివాస్ రూపంలో స్నేహితుడు దొరికాడు. అవసరాల తెరకెక్కించిన `ఊహలు గుసగుసలాడే`తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత రాశీ ఖన్నా ప్రయాణం గురించి తెలిసిందే. వాణీ కపూర్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇద్దరు రూమ్ మేట్స్ కెరీర్ పరంగా బంపర్ హిట్టు కొట్టారు!
