Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్‌.. క్యూట్ శ్లోకా

ఇక రెండో హీరోయిన్‌గా రాశీ ఖన్నా ఎంపికయినట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ‘శ్లోకా’ అనే పాత్రలో రాశీ కొత్తగా కనిపించనుంది.

By:  Tupaki Desk   |   22 July 2025 3:36 PM IST
ఉస్తాద్ భగత్ సింగ్‌.. క్యూట్ శ్లోకా
X

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరో ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల మెయిమ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండో హీరోయిన్‌గా రాశీ ఖన్నా ఎంపికయినట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ‘శ్లోకా’ అనే పాత్రలో రాశీ కొత్తగా కనిపించనుంది. ఈ లేటెస్ట్ అనౌన్స్మెంట్‌తో పాటు విడుదలైన ఫోటోలో ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.


గ్రీన్ కలర్ షార్ట్ డ్రెస్సులో, మెడలో కెమెరా వేసుకుని నవ్వుతూ ఉన్న రాశీ ఖన్నా లుక్ అభిమానుల్ని ఫిదా చేసింది. సాధారణంగా గ్లామర్ అండ్ ట్రెడిషనల్ రోల్స్‌లో ఎక్కువగా కనిపించే రాశీ, ఇప్పుడు కంప్లీట్‌గా యూ‌నిక్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఫోటోగ్రాఫర్ పాత్రలో కనిపించేలా ఉండటంతో, ఆమె క్యారెక్టర్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఫోటోని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

రాశీ ఖన్నా తెలుగులో డెబ్యూట్ అయిన దగ్గర నుంచి వైవిధ్యమైన పాత్రలు చేయాలని ప్రయత్నిస్తోంది. తన కెరీర్‌లో ఈ మధ్య పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా, ఓ బడా ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ సరసన అవకాశం రావడం రాశీకి లక్కీ ఛాన్స్‌గా మారింది. హరీష్ శంకర్ గతంలోనే ‘గబ్బర్ సింగ్’తో పవన్ కెరీర్‌కి కొత్త ఊపు తీసుకొచ్చిన డైరెక్టర్ కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఇప్పటికే శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా రాశీ ఖన్నా ఎంట్రీతో సినిమాపై మరోసారి ఫోకస్ పెరిగింది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ‘ఆమె సెట్స్‌కి తన అందం మరియు ఆకర్షణను తెస్తుంది’ అని చెప్పడం, ఆమె పాత్రలో కొత్త అందం ఉంటుందని హింట్ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు మేకర్స్ చెప్పడం, సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సూచిస్తోంది. ప్రస్తుతం రాశీ ఖన్నా బాలీవుడ్, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది. కానీ టాలీవుడ్‌లో ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకు సెలెక్ట్ అవ్వడం ఆమెకు మళ్లీ గుర్తింపు తెచ్చే అవకాశాన్ని ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె లుక్, పాత్ర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.