రాశీఖన్నాలో అసంతృప్తి..ఆవేదన!
సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే? వివాదాలకు వెళ్లకుండా కామ్ గా ఉంటేనే సాధ్యమవుతుంది.
By: Tupaki Desk | 23 Nov 2025 9:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే? వివాదాలకు వెళ్లకుండా కామ్ గా ఉంటేనే సాధ్యమవుతుంది. తప్పు అయినా సరే అక్కడ ప్రశ్నించడానికి ఉండదు. గొంతెత్తి మాట్లాడితే? బ్యాకెండ్ లో తొక్కే ప్రయత్నాలు అంతే సీరియస్ గా జరుగుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే? అందుకే ఇండస్ట్రీలో ఉన్న ఎవరూ వివాదాల జోలికి వెళ్లరు. ఎప్పుడైనా ఏదో అంశంపై వివాదాలు తలెత్తినా మాట్లాడానికి విముఖత చూపిస్తుంటారు. కానీ లోలోపల మాత్రం లావా మరుగుతూనే ఉంటుంది. అది అగ్ని పర్వతం రూపంలో ఎలా బయట పడుతుందన్నది చెప్పలేం.
కానీ సమయం వచ్చిందంటే బ్లాస్ట్ మామూలుగా ఉండదు. తాజాజా రాశీఖన్నా అలాగే బ్లాస్ట్ అయింది. రాశీఖన్నా అంటే ఇంత వరకూ కామ్ గోయింగ్ హీరోయిన్ అనే పేరు ఉంది. ఎలాంటి వివాదాల్లో వేలు పెట్టదు. తన పని తాను చేసుకుని పోవడం తప్ప! పరిశ్రమ అంతర్గత విషయాలు వేటిలోనూ ప్రవేశించదనే అభిప్రాయం ఉంది. కానీ సమయం వస్తే తాను కూడా శివంగిలా మారుతుందని ప్రూవ్ అయింది. తాజాగా అమ్మడు ఆన్ సెట్స్ లో సమానత్వం గురించి బ్లాస్ట్ అయింది. నటీనటుల మార్కెట్ విలువ ఎలా ఉన్నా? సినిమా సెట్స్‌లో మాత్రం అందరికీ సమాన గౌరవం దక్కాలని అభిప్రాయపడింది.
దేశంలో చాలా కాలంగా హీరో వర్షిప్ కల్చర్ ఉందని, హీరోల బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగా వారిని నమ్మడం నిజమే. కానీ మార్కెట్ అనేది జెండర్ పై కాకుండా ట్యాలెంట్ పై ఆధారపడాలంది. ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది మార్కెట్ మాత్రమే నిర్ణయిస్తుందన్నారు. తక్కువా? ఎక్కువా? అనే భావన ఆన్ సెట్స్ లో చూపించకూడదంది. మహిళా నటులకు మంచి సదుపాయాలు, వారికి లభించే గౌరవం ఎంత మాత్రం తగ్గకూడదంది. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రాశీఖన్నా ఇంత వరకూ ఎక్కడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఇక్కడ నటీనటులు, దర్శక, నిర్మాతలతో మంచి స్నేహం ఉంది. ఎలాంటి వివాదాలు కూడా ఆమె పై లేవు. అయితే రాశీఖన్నా ఈ మధ్య తెలుగు సినిమాల కంటే తమిళ, హిందీ సినిమాలకే ఎక్కువగా పని చేస్తోంది. అక్కడ ఎదురైన అనుభవాలు ఆధారంగా ఇలా స్పందించిందా? అన్న సందేహం నెటి జనులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాశీఖన్నా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోంది. బాలీవుడ్ లో రెండు సినిమాలు..కోలీవుడ్ లో ఓ చిత్రం చేస్తోంది.
