కలెక్టర్ అవ్వాలనుకున్నా హాట్ బ్యూటీ!
సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో ఇన్ ప్లూయోన్సర్ గా మారితే చాలు డైరెక్టర్ కి నచ్చితే పిలిచి హీరోయిన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 10 April 2025 4:00 PM ISTడాక్టర్ కాబోయ్ యాక్టర్లు అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొంత మంది డాక్టర్లు అయి యాక్టర్ అయితే? మరికొంత మంది యాక్టర్లు అయిన తర్వాత డాక్టర్లు అయ్యారు. హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్ట్ తీస్తే చాలా పెద్దదే ఉంటుంది. సాధారణంగా హీరోయిన్లు అంటే మోడలింగ్ నుంచే ఎక్కువగా వస్తుంటారు. కానీ ఇప్పుడు మోడలింగ్ తో పనిలేకుండానే హీరోయిన్లగా మారిపోతున్నారు.
సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో ఇన్ ప్లూయోన్సర్ గా మారితే చాలు డైరెక్టర్ కి నచ్చితే పిలిచి హీరోయిన్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్ వాళ్ల జీవితాన్నే మార్చేస్తుంది. తాజాగా కలెక్టర్ కాబోయ్ హీరోయిన్ అయిందన్న విషయంలో రాశీఖన్నా విషయంలో మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'ఊహలు గుస గుసలాడే' చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు కొన్నాళ్ల పాటు తిరుగు లేకుండా అవకాశాలు బాగానే అందకుంది.
వాటిలో సక్సెస్ లు చూస్తే పెద్దగా కనిపించవు. రాశీ గొప్ప పెర్పార్మర్ కాదు. కానీ అందం.. అభినయంతోనే రాశీకి ఇండస్ట్రీ అవకాశాలిచ్చింది. కానీ ఆ ఛాన్సులను సక్సెస్ లుగా మార్చుకోలేక పోయింది. దీంతో కోలీవుడ్ కి టర్నింగ్ తీసుకుంది. అక్కడ నుంచి ఇప్పుడు బాలీవుడ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం కోలీవుడ్ ...బాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేస్తోంది. అయితే డాక్టర్ వృత్తిపై మక్కువతో సినిమాను తాను చాలా చులకనగా చూసినట్లు తెలిపింది.
`ఐఏఎస్ అవ్వాలని కలలుకన్నాను. బాగా చదివాను. ఈ క్రమంలోనే నటన అంటే అభద్రతా భావాన్ని ఏర్పరుచుకున్నాను. నటనను చాలా చిన్నగా చూసాను. ఎవరూ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చూసే విధానం వేరుగా ఉంటుంది. అందుకే అలా భావించానమో. కానీ ఇదంతా తప్పు అని తర్వాత తెలసుకున్నాను. ఎన్ని సవాళ్లు ఎదుర్కుంటే? అంతగా రాటు దేలుతాం. ఆ అనుభవం జీవితంలో పైకి ఎదగడానికి ఎంతో దోహద పడుతుందని తెలిపింది.
