ఆ హీరోయిన్ టాలీవుడ్ మీద హోప్స్ వదులుకుందా..?
తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా గ్రాఫ్ పడిపోవడం వల్ల వెనకబడింది అందాల భామ రాశి ఖన్నా.
By: Tupaki Desk | 22 April 2025 8:45 AM ISTతెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా గ్రాఫ్ పడిపోవడం వల్ల వెనకబడింది అందాల భామ రాశి ఖన్నా. తెలుగులో మనం సినిమాలో మెరిసిన ఈ చిన్నది ఊహలు గుసగుసలాడే సినిమాతో లీడ్ రోల్ లో అలరించింది. అప్పటి నుంచి తన నటనతో ఆకట్టుకుంటూ వచ్చిన రాశి ఖన్నా రవితేజ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో నటించినా కూడా ఎందుకో టాప్ రేంజ్ కి వెళ్లలేకపోయింది. ఐతే తెలుగులో లాభం లేదు అనుకుని తమిళ సినిమాల మీద ఫోకస్ చేయగా అక్కడ కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉంది.
రాశి ఖన్నా తెలుగులో చివరగా 2022 లో థాంక్ యు సినిమా చేసింది. ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. అదే ఇయర్ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసినా లాభం లేకుండా పోయింది. అందుకే చిన్నగా కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది అమ్మడు. 3 ఏళ్ల తర్వాత రాశి ఖన్నాకి తెలుగులో ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న తెలుసు కదా సినిమాలో అమ్మడు నటిస్తుంది.
తెలుసు కదా సినిమాలో రాశి ఖన్నా తో పాటు శ్రీనిధి శెట్టి కూడా నటిస్తుంది. ఇందులో ఎవరు మెయిన్ ఎవరు సెకండ్ హీరోయిన్ అన్నది తెలియదు కానీ రాశి మాత్రం ఈ ఛాన్స్ తో మళ్లీ తెలుగులో అలరించాలని చూస్తుంది. తెలుగులో పెద్దగా హోప్స్ లేకపోయినా వచ్చిన అరకొర ఛాన్స్ లను అందుకుంటుంది రాశి ఖన్నా. తెలుసు కదా సినిమా వర్క్ అవుట్ అయ్యింది అంటే మరికొన్ని తెలుగు ఆఫర్లు అమ్మడికి వచ్చే అవకాశం ఉంటుంది.
ఐతే సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈమధ్య సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో టాప్ లేపేస్తుంది అమ్మడు. ఈమధ్యనే పూల్ సైడ్ లో హా**ట్ ఫోజులతో కిక్కు ఎక్కించేలా చేసింది రాశి ఖన్నా. అటు తమిళంలో ఇటు తెలుగు ఆడియన్స్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న రాశి ఖన్నా రాబోయే సినిమాలతో అయినా తన సత్తా చాటాలని చూస్తుంది. మరి అమ్మడికి లక్ కలిసి వతుందో లేదో చూడాలి. పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్న టాలీవుడ్ లో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తుంది రాశి ఖన్నాకి ఆఫర్లు కరువయ్యాయి. అందుకే ఇక్కడ హోప్ వదులుకుని తమిళంలోనే దూసుకెళ్లాలని చూస్తుంది.
