Begin typing your search above and press return to search.

రాశీ నిద్ర లేని క‌ళ్ల‌కు కార‌ణ‌మ‌దేనా?

ఇప్పుడు రాశీఖ‌న్నా ఓ నార్మ‌ల్ సెల్ఫీ ఫోటో షేర్ చేసి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. వైట్ టీ ష‌ర్ట్ వేసుకుని రాశీ షేర్ చేసిన ఈ ఫోటోలో ఆమె ఎలాంటి మేక‌ప్ వేసుకోలేదు.

By:  Tupaki Desk   |   19 May 2025 4:00 PM IST
రాశీ నిద్ర లేని క‌ళ్ల‌కు కార‌ణ‌మ‌దేనా?
X

మామూలుగా ఏదైనా ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవాలంటే అది సినిమా పోస్ట‌ర్ అయినా అయుండాలి లేదంటే హీరోయిన్ గ్లామ‌రస్ ఫోటో అయినా అయుండాలి. కానీ ఇప్పుడు రాశీఖ‌న్నా ఓ నార్మ‌ల్ సెల్ఫీ ఫోటో షేర్ చేసి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది. వైట్ టీ ష‌ర్ట్ వేసుకుని రాశీ షేర్ చేసిన ఈ ఫోటోలో ఆమె ఎలాంటి మేక‌ప్ వేసుకోలేదు.


ఫోటోతో పాటూ రాశీ ఓ క్యాప్ష‌న్ ను రాసుకొచ్చింది. సూర్యోద‌యానికి ముందు స్టంట్స్ చేసిన వారికి మాత్ర‌మే ఎర్ర క‌ళ్లుంటాయ‌ని రాశీ ఈ సంద‌ర్భంగా త‌న కోట్ లో రాసింది. రాశీ రాసిన క్యాప్ష‌న్ చిన్న‌దే అయిన‌ప్ప‌టికీ అది ఎంతో భిన్నంగా ఉంది. రాశీని అలా చూసిన ఫ్యాన్స్ కొంద‌రు ప్రేమ‌ను కురిపిస్తుంటే మ‌రికొంద‌రు ఆందోళ‌న ప‌డుతూ సినిమాల విష‌యంలో త‌న వేగాన్ని త‌గ్గించి రెస్ట్ తీసుకోవాల‌ని కోరుతున్నారు.

రాశీ ఈ ఫోటోలో అల‌సిపోయి, ఎర్ర‌టి క‌ళ్ల‌తో క‌నిపిస్తూ రెగ్యుల‌ర్ గా క‌నిపించే గ్లామ‌ర్ లుక్ కు చాలా భిన్నంగా ఉంది. అందుకే ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో మ‌రింత స్పెష‌ల్ గా నిలిచింది. రాశీ ఖ‌న్నా చివ‌రిగా అఘాతియా సినిమాలో క‌నిపించింది. అమ్మ‌డు ప్ర‌స్తుతం తెలుగులో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌తో క‌లిసి తెలుసు క‌దా సినిమా చేస్తుంది.

దాంతో పాటూ బాలీవుడ్ లో TME అనే యాక్ష‌న్ డ్రామాలో కూడా రాశీ న‌టిస్తోంది. ఈ రెండు సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే మ‌రోవైపు రాశీ స్టంట్ రిహార్స‌ల్స్ కూడా చేస్తుంది. ఇన్ని పనుల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్లే రాశీకి రెస్ట్ లేక అల‌సిపోయిన‌ట్టు క‌నిపిస్తుంది. చూస్తుంటే రాశీ ఈ రెండు సినిమాల కోసం చాలానే క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది.