సినిమాను చంపొద్దంటూ హెచ్చరిక!
ఈ నేపథ్యంలో రాయ్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో రాయ్ హెచ్చరికను క్రిషికా ఎలా తీసుకుంటారు? అన్నది చూడాలి.
By: Tupaki Desk | 23 July 2025 8:00 AM ISTధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `రాంజానా` బాలీవుడ్ లో ఎంత పెద్ద సక్సస్ సాధించిందో తెలిసిందే. ఒక్క హిట్ తో ధనుష్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోయాడు. తొలి సినిమాతోనే లవర్ బోయ్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు. రొమాంటిక్ డ్రామా చుట్టూ రాజకీయాలు, సామా జిక సమస్యలను స్పృశిస్తూ తీసిన చిత్రమిది. ఇందులో క్లైమాక్స్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచు తుంది. కథ ఆద్యంతం నెగిటివ్ క్లైమాక్స్ తో ముగుస్తుంది. హీరో పాత్ర చనిపోతుంది. అది ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది.
`రాంజానా` అంత పెద్ద సక్సెస్ అయిదంటే? కారణం క్లైమాక్స్..ధనుష్ నటనతో సాధ్యమైంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. దీనిలో భాగంగా క్లైమాక్స్ మార్చాలని నిర్మాత క్రిషికా లూలా ప్లాన్ చేస్తున్నారుట. నెగిటివ్ క్లైమాక్స్ ని తీసేసి హీరో బ్రతికి ఉన్నట్లు చూపించాలనే ఆలోచ నలో ఉన్నారుట. దానికోసం మళ్లీ షూటింగ్ చేయకుండా ఏఐ టెక్నాలజీతో ఆక్లైమాక్స్ ను పాజిటివ్ గా చూపించాలని నిర్మాత భావిస్తున్నాడుట.
ఈ నేపథ్యంలో ఇదే విషయం దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చెవిన పడటంతో ఆయన స్పందించారు. క్లైమాక్స్ ని పాజిటివ్ గా మార్చి సినిమాను చంపొద్దంటూ హెచ్చరించారు. రాంజానాకి నెగిటివ్ క్లైమాక్స్ అత్యంత కీలకం. దాన్నే పాజిటివ్ గా మార్చి రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం దర్శకుడిగా తన పేరు తీసేసి రీ-రిలీజ్ చేసుకోండన్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఆనంద్ ఎల్. రాయ్ కూడా భాగస్వామే. అయి తే మేజర్ షేర్ క్రిషాకాది కావడంతో హక్కులన్నీ అతడికే చెందుతాయి.
ఈ నేపథ్యంలో రాయ్ ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో రాయ్ హెచ్చరికను క్రిషికా ఎలా తీసుకుంటారు? అన్నది చూడాలి. ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ కోసమే క్లైమాక్స్ ని మార్చాల నుకుంటున్నారు. సౌత్ లో నెగిటివ్ క్లైమాక్స్ అంటే ఆడియన్స్ స్వాగతించరు. విలన్ ఎంత బలవం తుడైనా? వాడిని పడగొట్టి నిలబడటమే సౌత్ లో హీరోయిజం. ఈ నేపత్యంలో క్లైమాక్స్ విషయంలో క్రిషికా ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది.
