Begin typing your search above and press return to search.

రాయ్ లక్ష్మీ.. లుక్స్ తోనే చంపేసేలా..

ఫ్యాన్స్ కి గ్లామర్ లుక్స్ తో కనుల విందు చేయడంలో హీరోయిన్ రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటారు

By:  Tupaki Desk   |   14 May 2024 1:47 PM GMT
రాయ్ లక్ష్మీ.. లుక్స్ తోనే చంపేసేలా..
X

ఫ్యాన్స్ కి గ్లామర్ లుక్స్ తో కనుల విందు చేయడంలో హీరోయిన్ రాయ్ లక్ష్మి ఎప్పుడూ ముందుంటారు. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ టైమ్ టైమ్ లోనే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడు అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇక మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా అమ్మడు తనదైన శైలిలో గ్లామర్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది.

ఆతర్వాత రాఘవ లారెన్స్ కాంచన సినిమాలో మెరిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాకున్నా దక్షిణాదిన చాలా సినిమాల్లో ఆమె అలరించారు. అయినప్పటికీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేదు. ఇక ఆ తరువాత నెమ్మదిగా హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ టైమ్ లో ఐటెం సాంగ్స్ లోనూ మెరిసింది ఈ బ్యూటీ.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో ఆమె స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడారు. అందులో రత్తాలు సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను తెలుగు ఫ్యాన్స్ ముద్దుగా రత్తాలు అనికూడా పిలుస్తూ ఉంటారు. బాలీవుడ్ లోనూ ఆమె వరుస ఛాన్సులు అందుకుంది. అందాల ఆరబోత విషయంలోను కాస్త డోస్ పెంచి బికినీల్లోనూ దర్శనమిచ్చింది.

ఇక సోషల్ మీడియాలోనూ ఆమె షేర్ ఫోటోలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలనే ఆమె షేర్ చేసే లక్ష్మీకి ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఆమెకు కేవలం ఇన్ స్టాలో 7 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక లక్ష్మీ షేర్ చేసే ఫోటోలకు లైకుల వర్షం, కామెంట్ల వరద కురుస్తూనే ఉంటుంది.

రీసెంట్ గా మరోసారి ఆమె సూపర్ హాట్ గా కనిపించారు. స్టైలిష్ డ్రెస్సులో గాగుళ్స్ పెట్టుకొని ఎంతో అందంగా కనిపోయించింది. ఆ స్లీవ్ లెస్ టాప్ తో క్లీవేజ్ ఫోజులతో అదరగొట్టింది. ఆమె ఇచ్చిన అన్ని ఫోజులు స్టన్నింగ్ అనేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆమె ఫాలోవర్స్ సూపర్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లక్ష్మీ ఇలాంటి గ్లామర్ ట్రీట్ గతంలో చాలా సార్లు ఇచ్చింది. ఇక ఈ లుక్స్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయని మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.