Begin typing your search above and press return to search.

మరోసారి బికినీలో లక్ష్మీ రాయ్ గ్లామర్ డోస్

అయితే, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కాంచన" సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Sept 2024 5:38 PM IST
మరోసారి బికినీలో లక్ష్మీ రాయ్ గ్లామర్ డోస్
X

లక్ష్మీ రాయ్ సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది. 2004లో శ్రీకాంత్ సరసన "కాంచనమాల కేబుల్ టీవీ" సినిమాతో ఆమె వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోవడంతో ఆమెకు తెలుగులో పెద్ద అవకాశాలు దక్కలేదు. అయితే, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన "కాంచన" సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సినిమా ఘన విజయాన్ని సాధించడంతో లక్ష్మీ రాయ్ దక్షిణాది సినిమాల్లో బిజీ అయ్యింది. ఆమెకు పెద్ద అవకాశాలు రాకపోయినా, ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో నటిస్తూ అభిమానులను అలరించింది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోలతో చేసిన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఖైదీ నెంబర్ 150 "రత్తాలు" పాటతో మరో లెవెల్ క్రేజ్ అందుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ ఫ్యాన్స్ అదే పేరుతో పిలుస్తున్నారు.

తన అందంతో, అభినయంతో లక్ష్మీ రాయ్ కుర్రాళ్ళ మనసు దోచుకుంటూ, సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె బికినీ ఫోటో షూట్స్, స్టైలిష్ లుక్స్ తో అభిమానులకు దగ్గరయ్యింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో బికినీ ఫోటోలతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. కొన్ని స్పెషల్ పోటోలను ఆమె షేర్ చేసుకుంది.

ఇక సినిమా విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో అనసూయ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. లక్ష్మీ రాయ్, తన కెరీర్‌లో కొత్త అవకాశాలు, డిఫరెంట్ కంటెంట్ కలిగిన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు ఆమె ముందడుగు వేస్తోంది.