Begin typing your search above and press return to search.

పదేళ్ల తెలుగు 'క్వీన్‌' కి మోక్షం..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సూపర్ హిట్‌ సినిమాల్లో క్వీన్ ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తో ఉత్తమ నటి అవార్డును సైతం కంగనా దక్కించుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   4 Jan 2024 10:26 AM GMT
పదేళ్ల తెలుగు క్వీన్‌ కి మోక్షం..!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సూపర్ హిట్‌ సినిమాల్లో క్వీన్ ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తో ఉత్తమ నటి అవార్డును సైతం కంగనా దక్కించుకున్న విషయం తెల్సిందే. హిందీ క్వీన్‌ సూపర్‌ హిట్‌ నేపథ్యంలో సౌత్ లోని అన్ని భాషల్లో క్వీన్‌ ను రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యారు.


తెలుగు లో దట్ ఈజ్ మహాలక్ష్మి అనే టైటిల్‌ తో తమన్నా హీరోయిన్‌ గా క్వీన్‌ ను రీమేక్ చేయడం జరిగింది. ఇక తమిళంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా పారిస్‌ పారిస్‌ అనే టైటిల్‌ తో రీమేక్‌ చేశారు. మలయాళం మరియు కన్నడం లో కూడా ఈ రీమేక్‌ రూపొందింది.

2014 సంవత్సరం లో అన్ని భాషల్లో కూడా క్వీన్‌ రీమేక్ మొదలు అయింది. ఎప్పుడూ లేని విధంగా సమాంతరంగా నాలుగు భాషల రీమేక్ లు కూడా షూటింగ్‌ జరుపుకున్నాయి. అయితే ఏవో కారణాల వల్ల షూటింగ్‌ జాప్యం అవ్వడంతో పాటు, చివరకు విడుదలకు నోచుకోకుండా అయ్యాయి

క్వీన్‌ నాలుగు భాషల రీమేక్‌ చిత్రాలు షూటింగ్‌ ముగించుకున్నా కూడా విడుదల అవ్వలేదు. తెలుగు దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా విషయానికి వస్తే 2016 లో షూటింగ్‌ ముగించారని వార్తలు వచ్చాయి. దర్శకుడు మారాడు.. నిర్మాత విభేదాలు ఇలా అనేక పుకార్లు షికార్లు చేశాయి.

షూటింగ్ పూర్తి చేసుకుని ఉన్న క్వీన్‌ రీమేక్ ను థియేట్రికల్‌ రిలీజ్ కంటే కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయడం ఉత్తమం అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన దటీజ్ మహాలక్ష్మి సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.