Begin typing your search above and press return to search.

పీవీఆర్ ఇనాక్స్ బిగ్ ప్లాన్: రూ.400 కోట్లతో నెవ్వర్ బిఫోర్ అనేలా..

ఈ ప్రాజెక్టు కోసం పీవీఆర్ ఇనాక్స్ దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   6 July 2025 11:31 PM IST
పీవీఆర్ ఇనాక్స్ బిగ్ ప్లాన్: రూ.400 కోట్లతో నెవ్వర్ బిఫోర్ అనేలా..
X

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రేమికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఇంకా కొత్త స్క్రీన్లపై డిమాండ్ ఉంది. మంచి కంటెంట్. ఉన్న సినిమాలు వస్తే మల్టీప్లెక్స్ లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తునాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఇనాక్స్ తమ వ్యాపారాన్ని భారీ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమవుతోంది. రెండు సంవత్సరాల్లో 200 కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేసి, మొత్తం 2,000 స్క్రీన్‌ల టార్గెట్‌ను చేరుకోవాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టు కోసం పీవీఆర్ ఇనాక్స్ దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానంగా సౌత్ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో నాలుగు కొత్త స్క్రీన్లు ప్రారంభించారు. దీంతో దక్షిణభారత్‌లో మరిన్ని స్క్రీన్లకు ప్లాన్ వేస్తున్నారు.

ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 100 కొత్త స్క్రీన్లను ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నారు. వాటిలో 20 స్క్రీన్లు ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ప్రారంభించబడ్డాయి. ఈ 100 స్క్రీన్లలో 40 స్క్రీన్లు హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ వంటి దక్షిణ నగరాల్లో ఉంటాయని సంస్థ తెలిపింది. మిగతా స్క్రీన్లు ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, సిలిగురి, జబల్‌పూర్, లేహ్, గ్యాంగ్‌టక్ లాంటి ఇతర నగరాల్లో వస్తాయి.

ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా చిన్న పట్టణాల్లో కూడా స్క్రీన్ల సంఖ్యను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. 20 శాతం స్క్రీన్లు చిన్న పట్టణాల్లో, 40 శాతం దక్షిణ భారతదేశం రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయి. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి మరో 80 స్క్రీన్లు స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే ఈ సంఖ్యను 100 స్క్రీన్ల వరకు పెంచే అవకాశముంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పీవీఆర్ ఇనాక్స్‌కు 114 స్క్రీన్లు ఉన్నాయి. ఈ ఏడాది మాత్రమే 22 స్క్రీన్లు కొత్తగా హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటవుతాయి. హైదరాబాద్ రోజురోజుకీ మారుతున్న నేపథ్యంలో, నగర ప్రజలకు మెరుగైన ఎంటర్టైన్మెంట్ అందించేందుకు పీవీఆర్ కృషి చేస్తోంది. ఒక్క స్క్రీన్‌ను ఏర్పాటు చేయడానికి సగటున రూ.3.50 కోట్లు ఖర్చవుతోంది.

ఈ మొత్తాన్ని ఫ్రాంచైజ్ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ (FOCO) మోడల్‌లో పెట్టుబడి పెడతారు. అంటే 50 శాతం పెట్టుబడిని పీవీఆర్ ఇనాక్స్ సంస్థ, మిగతా 50 శాతం ను స్థానిక ఫ్రాంచైజీ పెట్టుబడిదారు కలిపి పెట్టనున్నారు. ఈ వ్యూహంతో పీవీఆర్ ఇనాక్స్ మరింత వేగంగా విస్తరించనుంది.