పీవీ సింధు.. భర్తతో వియత్నాంలో ఇలా..
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు గురించి అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 3:40 PM ISTభారత్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఆటకు ఎంతో మంది క్రీడాభిమానులు ఇప్పటికే ఉన్నారు. అలా సూపర్ ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పీవీ సింధు.. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ వైరల్ అవుతూనే ఉంటారు.
స్పోర్ట్స్ కాకుండా నార్మల్ ఔట్ ఫిట్స్ లో దిగిన పిక్స్ తో పాటు ట్రెండింగ్ సాంగ్స్ కు రీల్ చేస్తూ సింధు పోస్ట్ చేయడమే లేట్.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఆమె షేర్ చేసిన పిక్స్.. ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్న సింధు.. వియత్నాంలోని అమనోయిలో చిల్ అవుతూ కనిపించారు.
బికినీ వేసుకుని నీటిలో ఆడుకుంటున్న పిక్స్ ను పోస్ట్ చేసిన సింధు.. కొంత బ్రేక్ అవసరమంటూ క్యాప్షన్ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిను వివాహం చేసుకున్న ఆమె.. ఇప్పుడు హాలీడే ట్రిప్ కు వెళ్లారు. ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె పిక్స్ చూసి సూపర్ మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. యంగ్ స్టర్స్ కు మీరెప్పుడూ ఇన్స్పిరేషన్ మేడమ్ అని చెబుతున్నారు. మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేయండని అంటున్నారు. అదే సమయంలో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి సరైన టైటిల్ ను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు నెటిజన్లు.
అయితే కొంతకాలంగా వరుస టోర్నీలు ఆడుతున్నా.. సింధుకు కలిసి రావడం లేదు. చివరగా సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలిచిన ఆమె.. ఈ మధ్య కాలంతో మేజర్ టైటిల్ ను సొంతం చేసుకోలేదు. ఇటీవల మలేషియా మాస్టర్స్ లో తొలి రౌండ్ లోనే వెనుదిరిగారు. ఇండోనేషియా ఓపెన్ లోనూ గెలవాల్సిన మ్యాచ్ లో నిరాశపరిచి ఇంటి దారి పట్టారు.
ఇప్పుడు భవిష్యత్తులో జరగనున్న మరిన్ని టోర్నీల కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. కచ్చితంగా టైటిల్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిన్న బ్రేక్ కోసం ఇప్పుడు తన భర్తతో వియత్నాం వెళ్లారు సింధు. పర్సనల్ టైమ్ గడపడానికి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు!
