Begin typing your search above and press return to search.

పుష్ప 2 : మరో జాతీయ అవార్డు కోసం జాతర!

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినీ ప్రేమికులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:41 AM GMT
పుష్ప 2 : మరో జాతీయ అవార్డు కోసం జాతర!
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయి సినీ ప్రేమికులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది.

ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా యొక్క సీక్వెల్‌ అంటే కచ్చితంగా అదే స్థాయిలో అంచనాలు, ఆసక్తి ఉండటం కామన్ విషయం. కనుక పుష్ప 2 సినిమా పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ స్థాయిలో సినిమాను చేయాలి అంటే కచ్చితంగా యూనిట్‌ సభ్యులపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని తట్టుకుంటూ అంతకు మించి ఉండేలా పుష్ప 2 ను రూపొందిస్తున్నారట.

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప సినిమాలో నటనకి గాను జాతీయ అవార్డు సొంతం చేసుకున్న నేపథ్యం లో సీక్వెల్‌ లో అంతకు మించిన నటన ప్రతిభ కనబర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు, కష్టపడుతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న షూటింగ్‌ లో బన్నీ పడుతున్న కష్టం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

జాతర సన్నివేశం కు సంబంధించిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ మొదటి నుంచి చెబుతున్నారు. అన్నట్లుగానే జాతర షూటింగ్‌ జరుగుతోంది. ఇక బన్నీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు డాన్స్ తో కూడా ఆశ్చర్యపరిచే విధంగా నటిస్తున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ కోసం బన్నీ మేకప్‌ కే దాదాపు గా రెండు గంటల సమయం పడుతుందట. పోతురాజు గెటప్ తో సాధారణంగా నటించడమే గొప్ప విషయం. అలాంటిది ఏకంగా డాన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట. మొత్తానికి మరో జాతీయ అవార్డు కోసం బన్నీ తీవ్రంగా కష్టపడుతున్నాడు అంటూ ఫ్యాన్స్‌ మరియు సన్నిహితులు అంటున్నారు