Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. ఈ కష్టాన్ని ఎలా తట్టుకుంటారో?

దాంతో అనుకున్న డేట్ ఆగస్టు15న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 Jan 2024 6:11 AM GMT
పుష్ప 2.. ఈ కష్టాన్ని ఎలా తట్టుకుంటారో?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రూల్' గత పది రోజులుగా అనేక సవాలను ఎదుర్కొంటుంది. ఇది కాస్త అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆందోళన కలిగిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ అండ్ టీం ఈ మూవీ షూటింగ్ ని ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ కి ఏదో ఒక కారణం అడ్డుపడుతూ వస్తుంది.

దాంతో అనుకున్న డేట్ ఆగస్టు15న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. 'పుష్ప 2' చిత్రీకరణలో భాగంగా ఇటీవల జాతర సాంగ్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఇది సినిమా మొత్తంలో కీలక ఘట్టం. దాంతో సుకుమార్ ఈ పోర్షన్ ని షూట్ చేయడానికి రెండు నెలల సమయం తీసుకున్నాడు.

దీనికోసం అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పట్టడంతో ఇది కాస్త ముందునుంచి అనుకున్న ప్లాన్ పై ఇంపాక్ట్ చూపించింది. దాంతో ఇప్పటివరకు సగం షూటింగ్ మాత్రమే పూర్తయిందని నివేదికల్లో సూచిస్తున్నాయి. ఆగస్టు 15 కల్లా మిగతా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్, ఇవన్నీ సాధ్యం అవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సరిగ్గా ఇదే సమయంలో పుష్ప మూవీలో కేశవ పాత్రలో నటించిన జగదీష్ బండారిని పోలీసులు ఊహించని విధంగా అరెస్టు చేయడం మూవీ టీం కి మరో తలనొప్పిగా మారింది. జగదీష్ అరెస్టు కారణంగా 'పుష్ప 2' చిత్రీకరణకు మరింత అంతరాయం కలిగింది. ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకు మూవీ తీవ్రంగా కృషి చేస్తుంది. 'పుష్ప 2'టూ లో కేశవ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అతనే లేకపోవడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ కారణాలన్నీ సోషల్ మీడియాలో సినిమా వాయిదా పడుతుందన్న ఊహాగానాలను మరింత పెంచుతున్నాయి. వీటి వల్ల అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. అంతేకాదు ఈ రిలీజ్ డేట్ వాయిదా వార్తలు సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ని కూడా ప్రభావితం చేస్తోంది. మరి ఈ సంక్షోభ పరిస్థితిని సుకుమార్ అండ్ టీం ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి .