Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: పుష్పరాజ్‌పైనే కుట్ర‌..!

ఇంత‌కుముందు షారూఖ్ డంకీ సినిమాతో పోటీప‌డుతూ విడుద‌లైన స‌లార్ పై ఎలాంటి కుట్ర జ‌రిగిందో చూసాం.

By:  Tupaki Desk   |   8 Jan 2024 4:00 AM GMT
ట్రెండీ టాక్:  పుష్పరాజ్‌పైనే కుట్ర‌..!
X

ద‌క్షిణాది నుంచి వెళ్లి ఉత్త‌రాదిన‌ బంప‌ర్ హిట్లు కొడుతున్న సినిమాల్ని తొక్కేసేందుకు హిందీ మీడియాలు, అక్క‌డి విశ్లేష‌కులు చేస్తున్న కుట్ర‌లు కుతంత్రాలు బ‌హిరంగంగానే తెలిసిపోతున్నాయి. తెలుగు సినిమా దూకుడును త‌ట్టుకునేందుకు కొంద‌రు స్టార్ల అభిమానుల ఇన్వాల్వ్ మెంట్ తో సోష‌ల్ మీడియా- డిజిటల్ మీడియా ఆయుధాల‌ను నెగెటివ్ ప‌బ్లిసిటీ కోసం విరివిగా ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ పోర్ట‌ల్స్ ఉన్న‌వి లేనివి క‌ల్పించి రాస్తున్నాయి.

ఇంత‌కుముందు షారూఖ్ డంకీ సినిమాతో పోటీప‌డుతూ విడుద‌లైన స‌లార్ పై ఎలాంటి కుట్ర జ‌రిగిందో చూసాం. పీవీఆర్ ఐనాక్స్ లాంటి భారీ మ‌ల్టీప్లెక్స్ చైన్ డంకీకి ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను స‌లార్ కి ఇవ్వ‌క‌పోవ‌డంతో అస‌లు కుట్ర బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత స‌లార్ ని ద‌క్షిణాదినా పీవీఆర్ లో రిలీజ్ చేయ‌మ‌ని హోంబ‌లే సంస్థ ప్ర‌క‌టించ‌డంతో స‌ద‌రు సంస్థ వెంట‌నే దారికి వ‌చ్చింది. ఉత్త‌రాదిన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ముందుకు వ‌చ్చింది. చేసిన త‌ప్పును గ్ర‌హించి పీవీఆర్ ఐనాక్స్ బృందాలు రిక‌వ‌రీని ప్రారంభించాయి. కేవ‌లం ఇదొక్క‌టే కాదు రివ్యూల ద‌గ్గ‌ర నుంచి అన్నిటా స‌లార్ పై ప‌లు హిందీ మీడియాలు నెగెటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసాయి. ఇదంతా బాలీవుడ్ లో ఒక సెక్ష‌న్ చేస్తున్న కుట్ర‌కుతంత్రం అని అర్థ‌మైంది.

ఇప్పుడు అదే హిందీ మీడియా త‌దుప‌రి టాలీవుడ్ బిగ్ రిలీజ్ `పుష్ప‌2`ని టార్గెట్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌2 పై ఇప్ప‌టికే హిందీ మార్కెట్లో భారీ బ‌జ్ నెల‌కొంది. గ‌త ఏడాది అంతా గూగుల్ ట్రెండింగ్ లో నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది ఈ మూవీ న్యూస్. పుష్ప 2 గురించిన ప్ర‌తి అప్ డేట్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూసారు. గుగుల్ సెర్చ్ చేసారు. ఈ ఉత్సాహాన్ని మ‌రింత పెంచేందుకు పుష్ప 2 చిత్రం 2024 స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున రాబోతోంది. అదే స‌మ‌యంలో ప‌లు హిందీ భారీ చిత్రాలు విడుద‌ల కానున్నాయి. ఇదే అద‌నుగా ఇప్ప‌టి నుంచే పుష్ప 2 పై ప‌లు హిందీ పోర్ట‌ళ్లు ఇష్టానుసారం క‌థ‌నాలు అల్ల‌డం ప్రారంభించాయి. తాజాగా ఓ ప్ర‌ముఖ వెబ్ పోర్ట‌ల్ లో స‌లార్ ఆశించిన స్థాయికి చేరుకోలేదు గ‌నుక ఆ ప్ర‌భావం పుష్ప 2 పై ప‌డింద‌ని పుష్ప రేంజును త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నించింది.

US అలాగే హిందీలో కాకుండా ఇతర మార్కెట్‌లలో సలార్ బాక్సాఫీస్ పనితీరు తక్కువగా ఉన్నందున పుష్ప 2 కోసం డిస్ట్రిబ్యూటర్లు పునరాలోచనలో పడ్డారనేది స‌ద‌రు మీడియా క‌థ‌నం సారాంశం. నిజానికి తెలుగు రాష్ట్రాలు, హిందీ మార్కెట్, అమెరికా మార్కెట్ .. ఈ మూడింటిని టార్గెట్ చేస్తే చాలు సునాయాసంగా 600 కోట్లు వ‌సూలు చేయొచ్చ‌ని స‌లార్ పాఠం నేర్పింది. ఇదే బాట‌లో పుష్ప 2 కూడా విజ‌యం సాధిస్తే అదే చాలు. కానీ స‌లార్ కంటే పుష్ప 2పైనే అన్ని చోట్లా ఎక్కువ బ‌జ్ ఉంద‌నేది కాద‌నలేని నిజం. ఈ చిత్రాన్ని సుకుమార్ చాలా రీఫ్రెషింగ్ కంటెంట్ తో లావిష్ గా తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్ని మేకోవ‌ర్ ల‌తో మెరుపులు మెరిపించ‌బోతున్నాడు. పుష్పని గొప్ప‌గా ఆద‌రించిన పాన్ ఇండియా ఆడియెన్ సీక్వెల్ రాక కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. స‌లార్ పై చేసిన కుట్ర పుష్ప‌2 పై చేసినా కానీ ఏదీ ఆగ‌దు. కేజీఎఫ్ త‌ర్వాత కేజీఎఫ్ 2పైనా అంతో ఇంతో హిందీ మీడియా రుబాబ్ క్రియేట్ చేసింది. కానీ కేజీఎఫ్ 2 అజేయ‌మైన 1000 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు స‌లార్ కూడా 635 కోట్లు వ‌సూలు చేసి 700 కోట్ల క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతోంది. స‌లార్ 2 వ‌స్తే క‌చ్ఛితంగా అది భారీ యాక్ష‌న్ కంటెంట్ తో మ‌రో లెవ‌ల్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. కేజీఎఫ్ 300కోట్లు వ‌సూలు చేస్తే, కేజీఎఫ్ 2 చిత్రం 1200కోట్లు వ‌సూలు చేసింది. ఇప్పుడు స‌లార్ 700 కోట్లు వ‌సూలు చేసింది గ‌నుక స‌లార్ 2 చిత్రం 1500 కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని విశ్లేషిస్తే త‌ప్పు కాదు. అస‌లు క‌థంతా పార్ట్ 2లోనే ఉంటుంద‌ని ప్ర‌శాంత్ నీల్ తెలివిగా చెప్పాడు కాబ‌ట్టి, ఇది మ‌రింత క్యూరియాసిటీని పెంచే అంశం.

సలార్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.625 కోట్ల గ్రాస్ రాబట్టింది. సుమారు 450 కోట్ల షేర్ వ‌సూలైంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిందీలో రూ.100 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. అమెరికా నుంచి 60 కోట్లు వ‌సూలైంది. అయితే కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషల్లో ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్ర‌మే. కొంతమంది అభిమానుల అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమా కథ ఉగ్రమ్ కథను పోలి ఉంద‌ని అందుకే క‌న్న‌డలో ఆశించినంత హిట్ట‌వ్వ‌లేద‌ని ప్ర‌చార‌మైంది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సినిమా కూడా KGF తరహాలోనే ఉంటుందనేది డ్రాబ్యాక్ అయింది. అంతేకాదు డ్రామా క్లిక్ కాలేదని కొందరు విమ‌ర్శించారు. ఏది ఏమైనా కానీ నెగెటివ్ ప‌బ్లిసిటీ కార‌ణంగా స‌లార్ న‌ష్ట‌పోయిన మాట వాస్త‌వం. కానీ బాలీవుడ్ మీడియా దిగ‌జారుడు ప్ర‌యత్నాలు ఆపితేనే మంచిద‌నేది అంద‌రి అభిప్రాయం.