Begin typing your search above and press return to search.

1000 మందితో పుష్ప‌రాజ్ ఆటాపాట‌!

`పుష్ప‌-2` టీమ్ ని సుకుమార్ ప‌రుగులెట్టిస్తున్నారు. ఎక్క‌డా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Nov 2023 7:30 AM GMT
1000 మందితో పుష్ప‌రాజ్ ఆటాపాట‌!
X

`పుష్ప‌-2` టీమ్ ని సుకుమార్ ప‌రుగులెట్టిస్తున్నారు. ఎక్క‌డా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా టీమ్ అంతా రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తుంది. సెల‌వులు కేవ‌లం కొంత మందికే ఇచ్చి మిగ‌తా వారంద‌రినీ య‌ధావిధిగా పనిలో నిమ‌గ్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సుకుమార్ కూడా విశ్రాంతి తీసుకోవ‌డం లేదు. సెట్ లో ఆయ‌న అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా? సుకుమార్ మాత్రం సెట్ చుట్టూ రౌండ్లు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ పెళ్లి నేపథ్యంలో అల్లు అర్జున్ వారం రోజులు సెల‌వులు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వెంట‌నే షూట్ లో బిజీ అయ్యాడు.మ‌రి ప్ర‌స్తుతం షూటింగ్ అప్ డేట్ ఏంటి? అంటే రామోజీ ఫిలిం సిటీలో లాంగ్ షెడ్యూల్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఏకంగా నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్క‌డే ఉంటుం ద‌ని స‌మాచారం. దీనిలో భాగంగా 1000 మంది డాన్స‌ర్ల‌తో ఓ పాట చిత్రీక‌రిస్తున్నారుట‌. ఇందులో బ‌న్నీ స‌హా కొంత మంది కీల‌క న‌టులు కూడా భాగ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

ఈపాట‌కి గ‌ణేష్ ఆచార్య ఆద్వ‌ర్య కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం టీమ్ అంతా ఆ పాట ప‌నుల్లోనే నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. 1000 మంది డాన్స‌ర్ల‌పై పాట అంటే చిన్న విష‌యం కాదు. అంత‌మందిని కోఆర్డినేట్ చేసుకుంటూ పాట చిత్రీక‌రించ‌డం..దాన్ని పూర్తిచేయ‌డం అంటే రోజులు స‌మ‌యం ప‌డుతుం ది. ఈ పాట‌కే 15 రోజులు ప‌డుతుంద‌ని అంచ‌నా. అయితే ఆ పాట‌తో సంబంధం లేకుండా బ‌న్నీ లేని స‌న్నివేశాల్ని సుకుమార్ పూర్తిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక పాట సంగ‌తి చూస్తే! ఇంత మంది తారాగ‌ణంతో బ‌న్నీ ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టివ‌ర‌కూ ఇంత భారీ స్పాన్ ఉన్న ఏ పాట బ‌న్నీ పై చిత్రీక‌రించ‌లేదు. ఆ ర‌కంగా బ‌న్నీ స‌హా సుకుమార్ కెరీర్ లోనే మొట్ట మొద‌టి పాట‌గా చెప్పాలి. మరి పాట‌లో నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ఉందా? లేదా? అన్న‌ది తెలియాలి.