Begin typing your search above and press return to search.

పుష్ప 2 లో సమంత... ఈసారి అంతకు మించి

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పుష్ప 2 సినిమా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:31 AM GMT
పుష్ప 2 లో సమంత... ఈసారి అంతకు మించి
X

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పుష్ప 2 సినిమా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమా సత్తా చాటడంతో, దానికి సీక్వెల్‌ గా వస్తున్న పుష్ప 2 పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

పుష్ప సినిమాలో సమంత తో ఊ అంటావా మావ అంటూ ఐటం సాంగ్ ను చేయించిన విషయం తెల్సిందే. ఆ పాట ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా భారీ విజయంలో సమంత ఐటం సాంగ్ కూడా కచ్చితంగా ఎంతో కొంత పని చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సీక్వెల్‌ అనగానే కచ్చితంగా ఐటం సాంగ్ గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. పుష్ప 2 కోసం దర్శకుడు సుకుమార్‌ చాలా చర్చలు జరిపాడు. బాలీవుడ్‌ నుంచి మల్లూవుడ్‌ వరకు ఎంతో మంది స్టార్స్ హీరోయిన్స్ తో చర్చలు జరిపినా కూడా వర్కౌట్‌ అయినట్లుగా లేదు. అందుకు మళ్లీ సమంతను రంగంలోకి దించాలని భావిస్తున్నాడట.

గత కొన్ని రోజులుగా పుష్ప 2 ఐటం సాంగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి అంటున్నారు. సమంత తోనే పుష్ప 2 లో ఐటం సాంగ్ చేయించాలని భావిస్తున్నారు. కేవలం ఐటం సాంగ్ మాత్రమే కాకుండా అంతకు మించి అంటే కొన్ని సన్నివేశాల్లో ఆమెను నటింపజేయాలని కూడా భావిస్తున్నారట.

ఈ మధ్య కాలంలో సమంత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఏడాది పాటు బ్రేక్‌ అంటూ ప్రకటించిన సమంత త్వరలోనే రీ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. విడాకుల తర్వాత ఎలా అయితే పుష్ప లోని ఊ అంటావా పాటతో ఫుల్ స్వింగ్‌ లోకి వచ్చిందో అలాగే పుష్ప 2 లో కూడా సమంత వ్యాంప్‌ పాత్రలో కనిపించి ఐటం సాంగ్ తో దుమ్ము రేపి ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విషయమై చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సౌత్ లో కంటే నార్త్‌ లో ఈ సినిమాను ఎక్కువ ప్రచారం చేసి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ఈ సినిమాను సుకుమార్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.