Begin typing your search above and press return to search.

పుష్ప2… పూనకాలు వచ్చేలా 400 మందితో..

ఏకంగా 400 మంది జూనియర్ ఆర్టిస్ట్స్, 100 మంది డాన్సర్స్ తో, వివిధ ప్రాంతాల నుంచి జాతర వేషాలతో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:33 AM GMT
పుష్ప2… పూనకాలు వచ్చేలా 400 మందితో..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా కంటే డబుల్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు. ఏకంగా 350 కోట్ల వరకు పుష్ప 2పై మైత్రీ మూవీ మేకర్స్ వారు ఖర్చు చేస్తున్నారు.

పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా, దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. దీంతో పార్ట్ 2 విషయంలో వీరిద్దరిపైన అంచనాలు మరింత పెరిగిపోయాయి. పుష్ప సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. ఊ అంటావా సాంగ్ అయితే ఇప్పటికి ఎక్కడో ఓ చోట వినబడుతూనే ఉంటుంది. వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్స్ పాపులర్ అయ్యాయి.

ఈ సారి అంతకు మించి సాంగ్స్ ఉండేలా సుకుమార్, దేవిశ్రీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా షూటింగ్ షెడ్యుల్ ని స్టార్ట్ చేశారు. జాతర సెటప్ తో ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా ఈ పాటని తెరకెక్కిస్తున్నారు. ఏకంగా 400 మంది జూనియర్ ఆర్టిస్ట్స్, 100 మంది డాన్సర్స్ తో, వివిధ ప్రాంతాల నుంచి జాతర వేషాలతో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్ అదిరిపోయిందని, ఆడియన్స్ కి థియేటర్స్ లో పూనకాలు తెప్పించడం పక్కా అనే మాట వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు టాకీ పార్ట్ కూడా షూట్ చేస్తారంట. మొత్తం 45 రోజుల పాటు షూటింగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

మరి పుష్ప 2 సాంగ్స్ పుష్పని బీట్ చేసే విధంగా ఉంటే మాత్రం కచ్చితంగా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ పేరు దేశ వ్యాప్తంగా వినిపించడం ఖాయం. అలాగే ఈ సినిమాపై వెయ్యి కోట్ల కలెక్షన్స్ కూడా అందుకోవడం ఈజీ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.