Begin typing your search above and press return to search.

దేశం మొత్తం పుష్ప రాజ్ రీ సౌండ్ వినిపించేలా..?

సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి సృష్టించిన పుష్ప 1 ఏ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   23 April 2024 1:30 AM GMT
దేశం మొత్తం పుష్ప రాజ్ రీ సౌండ్ వినిపించేలా..?
X

సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి సృష్టించిన పుష్ప 1 ఏ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ మాస్ యాటిట్యూడ్ కి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పుష్ప సినిమాను తెలుగులోనే రిలీజ్ చేయాలని అనుకున్న సుకుమార్ కి పాన్ ఇండియా రిలీజ్ సలహా ఇచ్చి పరోక్షంగా సాయం చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. పుష్ప 1 తో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని కూడా అందుకున్నాడు.

ఇక ఇప్పుడు పుష్ప 2 తో మరికొన్ని రికార్డుల పని పట్టాలని చూస్తున్నారు. పుష్ప 2 ప్రచార చిత్రాలే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని ఆడియన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమాను నేషనల్ లెవెల్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ నార్త్ సైడ్ బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 ను దేశం మొత్తం మీద 5000 ల థియేటర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలాగు 1500 పైగా థియేటర్లు సిద్ధం చేస్తారు. నార్త్ సైడ్ 1500 నుంచి 2000లకు పైగా సెంటర్స్ వచ్చేలా చూస్తున్నారు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మిగతా అన్ని ఏరియాల్లో మరో 1000 కేంద్రాల్లో పుష్ప 2 రిలీజ్ ఉండబోతుంది.

దేశం మొత్తం 5000 థియేటర్ లలో పుష్ప రాజ్ సౌండ్ కి థియేటర్లు బ్లాస్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మరోసారి హైలెట్ గా నిలిచేలా ఏర్పాటు చేస్తున్నారట. పుష్ప 2 అసలు కథ ఇందులోనే ఉంది అనిపించేలా సుక్కు అంచనాలు పెంచేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ అయితే గంగమ్మ తల్లి అవతారంలో పూనకాలు తెప్పించేస్తున్నాడు. సినిమాపై ఉన్న బజ్ కి వదులుతున్న టీజర్లు కూడా రెట్టింపు ఉత్సాహాన్ని తెస్తున్నాయి. కచ్చితంగా పుష్ప 2 నెవర్ బిఫోర్ రికార్డులను కొట్టేందుకు వస్తున్నాడని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో కూడా పుష్ప 2 కోసం అక్కడ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా ఇదివరకు ఏ సినిమాకు లేనంత బజ్ ఏర్పడింది. సో పుష్ప 2 వచ్చాక రికార్డుల గురించి లెక్క పెట్టడమే అనే రేంజ్ వైబ్ కనిపిస్తుంది.