Begin typing your search above and press return to search.

పుష్ప 2.. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రెడీ అవుతోన్న పుష్ప ది రూల్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఉంది

By:  Tupaki Desk   |   17 April 2024 4:50 AM GMT
పుష్ప 2.. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రెడీ అవుతోన్న పుష్ప ది రూల్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఉంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. పుష్ప మూవీ సూపర్ హిట్ కావడంతో పుష్ప ది రూల్ మూవీ అంతకుమించి అనేలా ఉంటుందని మేకర్స్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.

పుష్ప మూవీ ద్వారా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతని పాపులారిటీ పెరిగిపోయింది. నార్త్ ఇండియన్ మార్కెట్ లో అల్లు అర్జున్ మాసివ్ ఇమేజ్ ని కలిగి ఉన్నాడు. అక్కడి బన్నీ అభిమానులు అయితే పుష్ప ది రూల్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ని చూస్తున్నారు.

రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజు పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ చేసిజ విషయం తెలిసిందే. గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ని టీజర్ గా కట్ చేసి వదిలారు. దీనికి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్స్ లో టాప్ 5లో నిలిచింది. దీనినిబట్టి సినిమా పట్ల పబ్లిక్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

పుష్ప సాంగ్స్ కూడా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. ఈ సారి అంతకుమించి బెస్ట్ సాంగ్స్ ని ఇవ్వాలని దేవిశ్రీ ప్రసాద్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. సుకుమార్ కూడా బెస్ట్ అవుట్ కోసం ఎక్కువ వర్క్ చేస్తున్నారు. కచ్చితంగా పుష్ప ది రూల్ తో భారీ ఓపెనింగ్స్ ని అందుకోవాలనే స్ట్రాంగ్ ఒపీనియన్ తో చిత్ర యూనిట్ ఉంది.

అయితే ఓపెనింగ్స్ భారీగా రావాలంటే కచ్చితంగా స్ట్రాంగ్ ప్రమోషన్ ఉండాలి. తాజాగా రిలీజ్ అయిన టీజర్ బజ్ క్రియేట్ చేసిన ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే టాక్ వచ్చింది. పుష్ప ది రూల్ నుంచి అంతకుమించి పబ్లిక్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉందంట.

కంటెంట్ ఇంకాస్త రివీల్ చేస్తే సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ చేసేలా సెకండ్ టీజర్ ని రెడీ చేసే పనిలో సుకుమార్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే సాంగ్స్ కూడా త్వరలో రిలీజ్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి మూవీకి ఒక బజ్ తీసుకురావాలని అనుకుంటున్నారంట. వీటిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.