Begin typing your search above and press return to search.

పుష్ప వెయిట్‌ పెంచే సూపర్‌ ఐడియా సుక్కు సర్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   8 March 2024 5:36 AM GMT
పుష్ప వెయిట్‌ పెంచే సూపర్‌ ఐడియా సుక్కు సర్‌
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త మీడియాలో వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఒక వార్తతో పుష్ప 2 సినిమా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఈసారి వార్త ఏంటి అంటే.. పుష్ప 2 సినిమాలో కీలకమైన గెస్ట్‌ రోల్‌ కు గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్‌ ను నటింపజేస్తున్నారట. ఆయన కనిపించేది 7 నుంచి 10 నిమిషాలు అయినా కూడా సినిమాకు అత్యంత కీలకమైన పాత్రగా సుకుమార్‌ భావిస్తున్నాడు. అందుకే సంజయ్ దత్‌ ను రంగంలోకి దించబోతున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సంజయ్ దత్‌ తో చర్చలు కూడా పూర్తి అయ్యాయట. సుకుమార్‌ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున బిజినెస్ చేయాలని చూస్తున్నాడు. అందుకోసం సంజయ్‌ దత్‌ వంటి బాలీవుడ్‌ స్టార్ ను నటింపజేయడం ద్వారా మంచి బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

బిజినెస్ పరంగా పుష్ప 2 కి కలిసి వచ్చే నిర్ణయాన్ని దర్శకుడు సుకుమార్ తీసుకున్నారు అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్‌ ప్రేక్షులు కూడా సంజయ్ దత్‌ ఉంటే పుష్ప 2 ను మరింత ఆసక్తిగా చూస్తారని, ప్రీ రిలీజ్ బజ్ కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. జాన్వీ కపూర్ తో ఐటం సాంగ్ ను చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. ఫాహద్‌ ఫాసిల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, సునీల్‌ ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.