Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : ఆ నవ్వు పుష్ప 2 పై నమ్మకం!

టీజర్ ఫైనల్‌ వర్షన్‌ ని చూసిన తర్వాత ఈ ముగ్గురు ఇలా చిరు మందహాసం తో ఫోటోకు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   5 April 2024 5:37 AM GMT
పిక్‌ టాక్‌ : ఆ నవ్వు పుష్ప 2 పై నమ్మకం!
X

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మోస్ట్‌ క్రేజీ మూవీ 'పుష్ప 2' షూటింగ్‌ చకచక జరుగుతోంది. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ కి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. అంతే కాకుండా వసూళ్లు భారీ ఎత్తున రావడంతో పుష్ప 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

పుష్ప 2 ను ఆగస్టు 15న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. వెయ్యి కోట్ల టార్గెట్‌ తో దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. పుష్ప కి పది రెట్లు ఎక్కువ అన్నట్లు పుష్ప 2 ఉంటుందని మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పుష్ప 2 టీజర్‌ ను ఈనెల 8న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. టీజర్ కోసం దేవి శ్రీ ప్రసాద్‌ ది బెస్ట్‌ అన్నట్లు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీజర్ ఫైనల్‌ వర్షన్‌ ని చూసిన తర్వాత ఈ ముగ్గురు ఇలా చిరు మందహాసం తో ఫోటోకు ఇచ్చారు.

ఈ ముగ్గురు త్రిమూర్తుల నవ్వు చూస్తూ ఉంటే పుష్ప 2 సినిమా పై మరింత నమ్మకం కలుగుతుందని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరి నుంచి వచ్చిన సినిమాలు మ్యూజికల్‌ గా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు.. అన్ని సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

సుకుమార్‌ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ ప్రతి సారి కూడా మ్యూజికల్‌ గా ది బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ను ఇవ్వడం మనం చూశాం. పుష్ప పాటలు వరల్డ్‌ వైడ్‌ గా ట్రెండ్‌ అయిన విషయం తెల్సిందే. అందుకే పుష్ప 2 పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. టీజర్ విడుదల తర్వాత పుష్ప 2 సినిమా పై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం అంటూ మేకర్స్ చాలా ధీమాతో ఉన్నారు.