Begin typing your search above and press return to search.

పుష్ప 2 స్పెషల్ సాంగ్.. డిమాండ్ ఎలా ఉందంటే..

ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించే పనిలో పడ్డారు.

By:  Tupaki Desk   |   11 July 2024 12:47 PM GMT
పుష్ప 2 స్పెషల్ సాంగ్.. డిమాండ్ ఎలా ఉందంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప ది రూల్ గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పుష్ప ది రూల్ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ 6కి రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించే పనిలో పడ్డారు. 300 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప ది రూల్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ కూడా ఈ సీక్వెల్ మీద చాలా కసిగా వర్క్ చేస్తున్నారు. కచ్చితంగా మొదటి సినిమా కంటే బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెర్ఫెక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ గా టాలీవుడ్ లో సుకుమార్ గురించి అందరూ చెబుతారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంతపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.

సమంత డివోర్స్ తర్వాత ఈ సాంగ్ కి ఊహించని విధంగా యాక్సప్ట్ చేసి చేసింది. సాంగ్ కి మంచి మైలేజ్ వచ్చింది. మూవీ సక్సెస్ లో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా చాలా కీలకంగా మారాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప మూవీకి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంతకుమించి సాంగ్స్ ని పుష్ప ది రూల్ కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పుష్ప ది రూల్ లో ఐటెం సాంగ్ ఇప్పటికే రెడీ అయిపొయింది అంట. అయితే సుకుమార్ షూట్ కంప్లీట్ చేయలేదని తెలుస్తోంది. దీనికి కారణం ఐటెం సాంగ్ కి సరిపోయే లీడ్ క్యారెక్టర్ దొరకకపోవడమే. ఈ సాంగ్ కోసం ముందుగా శ్రీలీలని అనుకున్నారంట. ఆమె మంచి డాన్సర్ కావడంతో పాటు క్రేజీ హీరోయిన్ గా ఉంది. దీంతో సాంగ్ కి మంచి హైప్ వస్తుందని అనుకున్నారు. అయితే శ్రీలీల వరుస ఫ్లాప్ ల కారణంగా క్రేజ్ తగ్గింది. త్రిప్తి డిమ్రి పేరు వినిపించింది. ఆమెకి సరిగా డాన్స్ రాదని పక్కన పెట్టారంట.

జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె కూడా సాంగ్ చేయడాకి ఒకే చెప్పిందంట. అయితే 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందంట. ఆమె హీరోయిన్ గా ఇప్పటి పెద్ద క్రేజ్ సంపాదించింది లేదు. దేవర మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. అంత పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా అని సుకుమార్ టీమ్ ఆలోచిస్తున్నారంట. జాన్వీ కపూర్ కి ఇచ్చిన ఎంత వరకు క్లిక్ అవుతుందనేది కూడా క్లారిటీ లేదు. అందుకే పుష్ప ది రూల్ ఐటెం సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయకుండా హోల్డ్ లో పెట్టారంట. మరి ఫైనల్ గా ఎవరిని సుకుమార్ ఈ సాంగ్ కోసం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.