Begin typing your search above and press return to search.

పుష్ప స్పెషల్ కోసం లేడీ 'కల్కి'తో చర్చలు...?

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:29 AM GMT
పుష్ప స్పెషల్ కోసం లేడీ కల్కితో చర్చలు...?
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా విజయంలో పాటలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా పుష్ప లోని సమంత ఐటం సాంగ్ ఓ రేంజ్ లో ఆధరణ దక్కించుకుంది. ఊ అంటావా మావా అంటూ దేవి ట్యూన్‌ చేసిన పాటకు సమంత, బన్నీ స్టెప్స్‌ తో అదిరి పోయింది.


పుష్ప 2 లో కూడా ఆ రేంజ్ ఐటం సాంగ్ కోసం సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. పుష్ప 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో అభిమానులు సినిమాను ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు సుకుమార్‌ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేసిన సుకుమార్‌ షూటింగ్‌ ముగింపు దశకు తీసుకు వచ్చాడు. ఆగస్టు లో సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. కనుక సుకుమార్‌ జెట్‌ స్పీడ్‌ తో వర్క్ ను చేస్తున్నాడు. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు, రెండు మూడు పాటలు మినహా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది.

ఐటం సాంగ్‌ విషయంలో చాలా రోజులుగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మళ్లీ సమంత ను దించే యోచనలో ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తే మరి కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మను దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మొదటి నుంచి కూడా దిశా పటానీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ప్రభాస్ కల్కి సినిమాలో సెకండ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుగుమ్మ దిశా పటానీ తో ఇప్పటికే చర్చలు జరిపారని, మరోసారి దిశాతో చర్చలు జరిపేందుకు సుకుమార్ టీం రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. వచ్చే నెల వరకు హీరోయిన్‌ ను ఫైనల్‌ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసే ఉద్దేశ్యంతో సుకుమార్ ప్లాన్‌ చేస్తున్నాడు.

పుష్ప సినిమాలోని బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సుకుమార్‌ పుష్ప 2 ను రూపొందిస్తున్నాడు. రష్మిక మందన్న పాత్ర తో పాటు సినిమాలోని అన్ని పాత్రలు కూడా కచ్చితంగా అలరించే విధంగా ఉంటాయని అంటున్నారు.