Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్‌కివి మ‌ర‌పురాని మ‌ధురమైన‌ క్ష‌ణాలు

అయితే ఈ అవార్డులు కార్య‌క్ర‌మం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు మ‌ర‌పురాని మ‌ధుర క్ష‌ణాల‌ని మిగిల్చింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:46 AM GMT
పుష్ప‌రాజ్‌కివి మ‌ర‌పురాని మ‌ధురమైన‌ క్ష‌ణాలు
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో, జీవితంలో అక్టోబ‌ర్ 17 మ‌ర‌పురాని, మ‌ర్చిపోలేని ప్ర‌త్యేక‌మైన రోజు. ఆయ‌న జీవితంలో మ‌ధుర క్ష‌ణాల‌ని అందించింది. బ‌న్నీ ఇటీవ‌ల జ‌రిగిన 2023 జాతీయ అవార్డుల్లో జాతీయ ఉత్త‌మ న‌టుడిగా 'పుష్ప‌' చిత్రానికి గానూ అవార్డుని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 69వ జాతీయ పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వం ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా జ‌రిగింది. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అవార్డు గ్ర‌హీత‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అవార్డులు అంద‌జేశారు.


అయితే ఈ అవార్డులు కార్య‌క్ర‌మం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు మ‌ర‌పురాని మ‌ధుర క్ష‌ణాల‌ని మిగిల్చింది. 70 ఏళ్ళ సినీ చ‌రిత్ర‌లో ఏ తెలుగు హీరోకు ద‌క్క‌కుండా అంద‌రి ద్రాక్ష‌గా మారి ఏడు ద‌శాబ్దాలుగా దోబూచులాడుతున్న జాతీయ ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం 'పుష్ప‌' చిత్రంలోని పుష్ప‌రాజ్ పాత్ర‌కు గానూ బ‌న్నీని వ‌రించింది. ఈ క్ష‌ణాల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూసిన తెలుగు ప్రేక్ష‌కులు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు రావ‌డంతో హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.


ఇక ఈ అవార్డుని బ‌న్నీ అందుకునే క్ష‌ణాల కోసం ఎదురు చూసిన బ‌న్నీ కుటుంబం స్వ‌యంగా అవార్డు కార్య‌క్ర‌మంలో పాల్గొని పుత్రోత్స‌హాంతో పొంగిపోయింది. ఈ అవార్డుల కార్య‌క్ర‌మం కోసం బ‌న్నీ, త‌న భార్య స్నేహా రెడ్డి, త‌ల్లిదండ్రులు అల్లు అర‌వింద్‌, త‌ల్లి నిర్మ‌ల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. అ్లుల అర్జున్‌ని అవార్డు ఫంక్ష‌న్ కోసం స్వ‌యంగా రెడీ చేసి స్నేహారెడ్డి మురిసిపోయారు. భార్య‌తో ఉన్న ఆ క్ష‌ణాల‌ని బ‌న్నీ సెల్ఫీ తీసుకోగా దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


'పుష్ప‌' సినిమాగానూ దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అవార్డు అందుకోగా అత‌న్ని ఆత్మీయంగా బ‌న్నీ ఆలింగ‌నం చేసుకున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ఇదే ఫంక్ష‌న్‌కు అల్లు అర‌వింద్‌, నిర్మ‌ల కూడా హాజ‌రు కావ‌డంతో ఆ మ‌ధుర క్ష‌ణాల‌ని బ‌న్నీ ఆస్వాదిస్తూ మురిపిసోవ‌డం విశేషం. ఈ మ‌ధుర క్ష‌ణాలకు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకున్న బ‌న్నీ 'నా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వ్య‌క్తుల‌తో గుర్తుంచుకోవాల్సిన రోజు' అంటూ స‌ద‌రు ఫొటోల‌ని అల్లు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం బ‌న్నీ కి మ‌ర‌పురాని మ‌ధురమైన‌ క్ష‌ణాలకు సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.