Begin typing your search above and press return to search.

బెర్లిన్ గడ్డపై పుష్ప రాజ్ జోష్.. స్టన్నింగ్ లుక్స్

ప్రస్తుతం ఆయన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:30 PM GMT
బెర్లిన్ గడ్డపై పుష్ప రాజ్ జోష్.. స్టన్నింగ్ లుక్స్
X

సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ఇండియ‌న్ సినిమా త‌ర‌ఫున ప్రాతినిథ్యం వ‌హించే అవ‌కాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ కు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే జర్మనీ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.


అయితే అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి ఘన విజయం సాధించిందో సంగతి తెలిసిందే. 2021లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 తెరకెక్కుతోంది.


తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ లో పుష్ప చిత్రాన్ని స్పెష‌ల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహ‌కులు. ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెట్టింట పుష్ప తగ్గేదేలే అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నందుకు పుష్ప టీమ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుష్ప-2 కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.


మరోవైపు, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన ఓ పార్టీకి పుష్ప టీమ్ అటెండ్ అయింది. అందుకు సంబంధించిన చిత్రాలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్లోబల్ మీడియాతోపాటు ఫిల్మ్ సర్కిల్స్ తో పుష్ప విజయాన్ని ఒక గ్రాండ్ ఈవెనింగ్ లో సెలబ్రేట్ చేసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఆ పార్టీలో అల్లు అర్జున్ బ్లాక్ కలర్ షూట్ లో అదరగొట్టారు. ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం బన్నీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.


ఇక పుష్ప ది రైజ్ సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐకాన్ స్టార్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ పుష్ప పార్ట్-1కు మించి రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.