Begin typing your search above and press return to search.

పుష్పరాజ్ వెయ్యి కోట్ల కల.. సాధ్యమేనా?

దానికి కారణం ఆగష్టు 15 తర్వాత ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంది

By:  Tupaki Desk   |   12 Sep 2023 3:52 AM GMT
పుష్పరాజ్ వెయ్యి కోట్ల కల.. సాధ్యమేనా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప 2. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. బన్నీ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ సిద్ధమవుతోంది . మైత్రీ మూవీ మేకర్స్ 300 కోట్లకి పైగానే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వర్కౌ 50శాతం షూటింగ్ అయినట్ల తెలుస్తోంది. పుష్ప మొదటి భాగంలో ఉన్న యాక్టర్స్ తో పాటుగా జగపతిబాబు కూడా ఓ కీలక పాత్రలో సినిమాలో కనిపించబోతున్నారు.

తాజా చిత్ర యూనిట్ పుష్ప 2 రిలీజ్ డేట్ ని పోస్టర్ తో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పాన్ ఇండియా లెవల్ లో పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ పోస్టర్ లో పుష్ప రాజ్ స్టైల్ గా కూర్చొనిఎం, అతని అతని చేతికి మూడు ఉంగరాలు మెళ్ళో నగలతో ఉన్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజానికి పుష్ప 2 మూవీ ఏప్రిల్ లో రిలీజ్ అయిపోతుందని అందరూ భావించారు.

అనూహ్యంగా ఏడాది తర్వాత రిలీజ్ చేయబోతున్నట్లు సుకుమార్ టీమ్ పోస్టర్ తో అభిమానులకి షాక్ ఇచ్చింది. దీనిని బట్టి సినిమాని సుకుమార్ చాలా శ్రద్ధగా తెరకెక్కిస్తున్నాడని అర్ధమవుతోంది. దేవిశ్రీ ప్రాసాద్, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డులు రావడమా కూడా పుష్ప 2 మూవీ రిలీజ్ మరింత వెనక్కి వెళ్ళడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే ఈ రిలీజ్ డేట్ తో చిత్ర యూనిట్ అనుకుంటున్న వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ ని అందుకునే ఛాన్స్ ఉండకపోవచ్చని మాట వినిపిస్తోంది.

దానికి కారణం ఆగష్టు 15 తర్వాత ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ మంచిగా వచ్చే అవకాశం ఉంది . అయితే నెక్స్ట్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న ఇండియన్ 2 మూవీ రిలీజ్ కానుంది. అదే సమయంలో అజయ్ దేవగన్ సింగం 3 మూవీ కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. నార్త్ లో ఈ సిరీస్ కి మంచి ఆదరణ ఉంటుంది. ఈ రెండు సినిమాల పోటీ నుంచి తట్టుకొని నిలబడటం పుష్ప 2 మూవీకి అతి పెద్ద టాస్క్.

వీటిని దాటుకొని వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. మరి ఆ ఫీట్ ని అల్లు అర్జున్ సోలోగా అందుకుంటే మాత్రం రికార్డ్ క్రియేట్ చేసినట్లే అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలు తప్ప ఇంకేవీ కూడా వెయ్యి కోట్లు దాటలేదు. మరి ఈ రేర్ ఫీట్ కి ఎంత వరకు బన్నీ అందుకోగలడు అనేది చూడాలి.