Begin typing your search above and press return to search.

కుర్చీలో బ‌న్నీ..చేతిలో గొడ్డ‌లి..ఇక తెగ న‌ర‌క‌డ‌మే!

ఇప్ప‌టికే రిలీజ్ అయిన బ‌న్నీ లుక్...ఇత‌ర న‌టీన‌టుల పోస్ట‌ర్ల‌తోనే సినిమాపై క్యూరియాసిటీ అంత‌కంత‌కు పెరిగిపోతుంది.

By:  Tupaki Desk   |   7 April 2024 5:46 PM GMT
కుర్చీలో బ‌న్నీ..చేతిలో గొడ్డ‌లి..ఇక తెగ న‌ర‌క‌డ‌మే!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `పుష్ప-2 ది రూల్` పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా రెండ‌వ భాగం రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన బ‌న్నీ లుక్...ఇత‌ర న‌టీన‌టుల పోస్ట‌ర్ల‌తోనే సినిమాపై క్యూరియాసిటీ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. ఇక టీజ‌ర్..ట్రైల‌ర్ వ‌స్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ స‌మ‌యం ఎప్పుడొస్తుందా? అని కొన్ని నెల‌లు గా ప్రేక్ష‌కాభిమానులు ఎదురు చూస్తున్నారు.


ఇదిగో రిలీజ్..అదిగో రిలీజ్ అని ప్ర‌చారం త‌ప్ప సుకుమార్ ఇంత‌వ‌ర‌కూ స‌ర్ ప్రైజ్ చేసింది లేదు. తాజాగా ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 11:07 నిమిషాల‌కు టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్ అధికారికంగా కొద్ది సేప‌టి క్రితేమే ప్ర‌క‌టించారు. దానికి సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ని ఆదివారం విడుద‌ల చేశారు. పోస్ట‌ర్ తోనే సుకుమార్ మ‌రోసారి పీక్స్ కి తీసుకెళ్లిపోయార‌ని చెప్పొచ్చు. బ‌న్నీ మాస్ లుక్ మామూలుగా లేద‌నే చెప్పాలి.

బ‌న్నీ ఎంత మొర‌టుగా చూపించాలో? ప్రేక్ష‌కుల ఊహ‌కంద‌ని విధంగా ఆ పాత్ర‌ని డిజైన్ చేసిన‌ట్లు మ‌రోసారి తేట‌తెల్ల‌మ‌వుతోంది. కుర్చీలో బ‌న్నీ..కుడి చేతిలో గొడ్డ‌లి ప‌ట్టుకుని కుర్చున్న విధానికి ఫిదా అవ్వాల్సిందే. ఎంతో ఫెరోషియ‌స్‌గా- ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. రంగు రంగుల చొక్కా.. లుంగీ.. మెడ‌లో బంగారు గొలుసులు..వేళ్ల‌కు ఉంగ‌రాలు..చేతికి క‌డియాలు..కాళ్ల‌కు బెల్టు చెప్పులు ధరించి ఊర మాస్ పుష్ప‌రాజ్ ని చూపించారు. కుర్చీలో అత‌డు కూర్చున్న భంగిమ అంతే మాస్ హైలైట్ అవుతుంది.

క‌ళ్ల‌కు అద్దాలు..వాటిలో నుంచి కోర చూపులు బ‌న్నీ స్వాగ్ అంత‌కంత‌కు పోస్ట‌ర్ లోనే హైలైట్ చేసారు. వెనుక బ‌న్నీ సైన్యం అంతే మాసీవ్ గా ఉంది. ఇక టీజ‌ర్ ఎలా ఉంటుందో ఊహ‌కే అంద‌దేమో అన్నంత‌గా క‌నిపిస్తుంది స‌న్నివేశం. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. బ‌న్నీ లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మాస్ కా బాస్ అన్న రేంజ్ లో మా బాస్ ఉన్నాడంటూ ఫిదా అవుతున్నారు. మేమంతా టీజ‌ర్ రిలీజ్ కోసం వెయిటింగ్ అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.