Begin typing your search above and press return to search.

అందరిది ఒక లెక్క.. పుష్ప 2 మరో లెక్క!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   1 April 2024 12:30 PM GMT
అందరిది ఒక లెక్క.. పుష్ప 2 మరో లెక్క!
X

టాలీవుడ్ లో ఈ ఏడాది అరడజనుకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఈ సినిమాలు అన్ని కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నవే కావడం విశేషం. ఇక ఈ సినిమాలకి సంబందించిన డిజిటల్ రైట్స్ రికార్డ్ ధరలకి అమ్ముడవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

నవంబర్ లేదా డిసెంబర్ లో గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులని 105 కోట్లకి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమా రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఛానల్ దక్కించుకుంది. ఈ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లతో డీల్ సెట్ చేసుకోవడం విశేషం.

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ జూన్ లేదా జులైలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా డిజిటల్ రైట్స్ కోసం చర్చలు నడుస్తున్నాయంట. నిర్మాత అశ్వినీ దత్ ఏకంగా 200 కోట్లు డిజిటల్ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక మూవీపైన క్రియేట్ అయ్యే బజ్ బట్టి ఓటీటీ ఛానల్స్ 200 కోట్లు ఇవ్వడానికి ముందుకి రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక పుష్ప ది రూల్ మూవీ కోసం మైత్రీ మూవీ మేకర్స్ నెట్ ఫ్లిక్స్ మధ్య చర్చలు నడుస్తున్నాయని టాక్. ఇంకా రేట్ అయితే ఫైనల్ కాలేదు. అల్లు అర్జున్ పుట్టిన రోజున టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఆ తరువాత రేటు చెప్పాలని మైత్రీ నిర్మాతలు చూస్తున్నారంట. నాన్ థీయాట్రికల్ ఓటీటీ డీల్ తో 150 కోట్ల వరకు రాబట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తుకున్నారంట. కానీ నెట్ ఫ్లిక్స్ 110 కోట్లకి డీల్ క్లోజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి పుష్ప టీజర్ అనుకున్నట్లుగా హైప్ క్రియేట్ చేసి మంచి డీల్ కుదిరేలా చేస్తుందో లేదో చూడాలి. ఈ నాలుగు సినిమాలపై ప్రస్తుతం మార్కెట్ లో ఎక్స్ పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి. అయితే సినిమాలని ఎంత స్ట్రాంగ్ గా ఆడియన్స్ దగ్గరకి తీసుకొని వెళ్తారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనేదానిపై ఈ చిత్రాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఆధారపడి ఉండే అవకాశం ఉంది.