Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ (X) బ‌న్ని.. బ‌రిలో ఎవ‌రు ముందు?

పుష్ప వ‌ర్సెస్ గేమ్ ఛేంజ‌ర్ అయితే అభిమానుల్లో పుష్ప 2- గేమ్ ఛేంజ‌ర్ చిత్రాల్లో దేనికి క్రేజ్ ఎక్కువ‌? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   13 April 2024 11:30 PM GMT
చ‌ర‌ణ్ (X) బ‌న్ని.. బ‌రిలో ఎవ‌రు ముందు?
X

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ స్టార్ హీరోల న‌డుమ తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. పాన్ ఇండియా ట్రెండ్‌ని అనుస‌రిస్తూ వీరంతా ఒక‌రితో ఒక‌రు పోటాపోటీగా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. ఒక్క మెగా కాంపౌండ్ నుంచి ఇద్ద‌రు స్టార్ హీరోలు నువ్వా నేనా? అంటూ పోటీప‌డుతున్నారు. ఆ ఇరువురి న‌డుమా ఆరోగ్య‌క‌ర‌మైన పోటీత‌త్వం క‌నిపిస్తోంది.

ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంతో జాతీయ అంత‌ర్జాతీయ‌ స్థాయి గుర్తింపును సంపాదించుకోగా, అదే స‌మ‌యంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్ కూడా జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపును ద‌క్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పాన్ వ‌ర‌ల్డ్ లో గొప్ప విజ‌యాల్ని న‌మోదు చేసాయి. ఇటీవ‌ల ఈ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు భారీ ప్ర‌ణాళిక‌ల‌తో బాక్సాఫీస్ పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇద్ద‌రు మెగా హీరోలు త‌మ‌ ఇమేజ్ ని మ‌రో స్థాయికి చేర్చాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప 2' త‌నకు కెరీర్ లో మ‌రో మైలురాయిని అందిస్తుంద‌ని భావిస్తున్నాడు. అదే స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ త‌న కెరీర్ గేమ్ ని మారుస్తుంద‌ని ఆశిస్తున్నాడు. ఈ ఇద్ద‌రూ త‌దుప‌రి 1000 కోట్ల క్ల‌బ్ పై క‌న్నేశారు. క‌చ్ఛితంగా వారు ఆశించిన మ్యాజిక్ జ‌రిగితే టాలీవుడ్ క్రేజ్ ను జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో మార్మోగేలా చేసిన వార‌వుతారు.

పుష్ప వ‌ర్సెస్ గేమ్ ఛేంజ‌ర్ అయితే అభిమానుల్లో పుష్ప 2- గేమ్ ఛేంజ‌ర్ చిత్రాల్లో దేనికి క్రేజ్ ఎక్కువ‌? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిజానికి బ‌న్ని, చ‌ర‌ణ్ ఇద్ద‌రికీ ఇప్పుడు ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదినా భారీ ఫాలోయింగ్ ఉంది. ఇద్ద‌రి మార్కెట్ రేంజ్ అమాంతం విస్త‌రించింది. అదే క్ర‌మంలో పుష్ప 2 , గేమ్ ఛేంజ‌ర్ రెండిటి గురించి జాతీయ స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు స‌నిమాలు పాన్ ఇండియాలో ఘ‌న‌విజ‌యం సాధిస్తాయ‌ని అంతా భావిస్తున్నారు.

అయితే పుష్ప 2 కి ఇప్ప‌టికే మార్కెట్లో భారీ బ‌జ్ నెల‌కొన‌డంతో దీనిపై భారీ బెట్టింగ్ కోసం పంపిణీ వ‌ర్గాలు సిద్ధంగా ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు శంక‌ర్ - చ‌ర‌ణ్- దిల్ రాజు ఫ్యాక్ట‌ర్ తో గేమ్ ఛేంజ‌ర్ బిజినెస్ కి ఢోకా లేద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. థియేట్రిక‌ల్ గా నాన్ థియేట్రిక‌ల్ గా అల్లు అర్జున్, చ‌ర‌ణ్ ల సినిమాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఎవ‌రు విజేత అవుతారు? అనేది వారి స్థాయిని నిర్ధేశిస్తుంది. కొన్నిటికి కాల‌మే సమాధానం ఇవ్వాలి. రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతుండ‌గా, అల్లు అర్జున్ పుష్ప 2 ఆగ‌స్టు 15న విడుద‌ల కానుంది.