Begin typing your search above and press return to search.

పుష్ప 2 : ఇన్నాళ్లు యాక్షన్‌ ఇప్పుడు అసలు మ్యాటర్‌

పుష్ప 2 పై ఉన్న అంచనాల నేపథ్యంలో అంత ఆశామాషీగా ఈ సినిమాను తీయకుండా పుష్ప కి మించి అన్నట్లుగా తీయాలని సుకుమార్ భావించాడు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 3:55 PM GMT
పుష్ప 2 : ఇన్నాళ్లు యాక్షన్‌ ఇప్పుడు అసలు మ్యాటర్‌
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొంది సూపర్ హిట్‌ అయిన పుష్ప కి సీక్వెల్‌ గా పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 పై ఉన్న అంచనాల నేపథ్యంలో అంత ఆశామాషీగా ఈ సినిమాను తీయకుండా పుష్ప కి మించి అన్నట్లుగా తీయాలని సుకుమార్ భావించాడు.

అందుకు తగ్గట్లుగానే పుష్ప 2 ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ కూడా పుష్ప 2 కోసం చాలా కష్టపడుతున్నాడు. పుష్ప కి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యం లో పుష్ప 2 లో తన నటన అంతకు మించి ఉండాలి అనే ఉద్దేశ్యంతో యాక్షన్‌ సన్నివేశాలను చేయడం జరిగింది. ఇప్పటి వరకు సినిమా దాదాపుగా 70 శాతం పూర్తి అయిందని సమాచారం అందుతోంది.

ఇటీవల పూర్తి అయిన షెడ్యూల్‌ తో కీలక యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారట. ఇప్పుడు కొంత మార్పు కోసం అన్నట్టుగా పుష్ప 2 మేకర్స్ పాటల చిత్రీకరణ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్‌ పుష్ప కి సంగీతాన్ని అందించాడు. ఆ పాటలు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నాయి... ఆ పాటల వల్ల పుష్ప కి ఎంతటి క్రేజ్ దక్కింది అనేది తెల్సిందే.

పుష్ప 2 కోసం కూడా దేవి శ్రీ ప్రసాద్‌ కచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా పాటలు ఉండేలా కంపోజ్‌ చేసి ఉంటాడు అనడంలో సందేహం లేదు. అందుకే పుష్ప 2 పాటల కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా పాటల చిత్రీకరణ మొదలు పెడుతున్నారు కనుక త్వరలో ఒక్కొక్కటి చొప్పున పాటలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.

పుష్ప లోని పాటలు, ఆ పాటల్లోని డాన్స్ లు, పాటల్లో అల్లు అర్జున్‌, రష్మిక, సమంతల లుక్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే పాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు పుష్ప 2 తో కూడా పాటల్లో ఒక సరికొత్త ట్రెండ్‌ ని సృష్టించాలని సుకుమార్‌ భావిస్తున్నాడట. అది ఎలా అనేది తెలియాల్సి ఉంది.

వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఫహద్‌ ఫాసిల్ కీలకంగా కనిపించబోతున్నాడు. సునీల్‌ మరియు అనసూయ పాత్రలు కొనసాగుతాయా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఐటం సాంగ్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.