Begin typing your search above and press return to search.

పుష్ప 2 అడుగు పడింది.. ఆ రోజు టీజర్ జాతరే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు

By:  Tupaki Desk   |   2 April 2024 11:39 AM GMT
పుష్ప 2 అడుగు పడింది.. ఆ రోజు టీజర్ జాతరే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. 2021 లో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు సీక్వెల్ అంతకుమించి అనేలా ఉండబోతుంది అని పోస్టర్స్ ద్వారానే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా ఫాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ మరింత హై వోల్టేజ్ టచ్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే లేడీ గెటప్ లో ఉగ్రరూపంతో కనిపించిన బన్నీ పోస్టర్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు మరొక పోస్టర్ ద్వారా సినిమా టీజర్ పై కూడా అధికారికంగా అప్డేట్ ఇచ్చారు. రిలీజ్ అయిన పోస్టర్ లో హీరో కాలుకి గజ్జలు కట్టుకొని నాట్యం ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. మాతంగి ట్రెడిషనల్ జాతరలో భాగంగా ఒక హై వోల్టేజ్ సీన్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. అందులోనే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా బలంగా ఉంటాయని ఇదివరకే కొన్ని గాసిప్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఈ అప్డేట్ కోసమే ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి పోస్టర్ ద్వారా అలాగే అప్డేట్ తో సినిమా పై చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త ట్రెండింగ్ లిస్టులోకి వెళ్లిపోయింది.

అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కెట్ ను అందుకోవాలని చూస్తున్నాడు. సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 650 కోట్లకు పైగానే ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా కూడా వెయ్యి కోట్ల టార్గెట్ అందుకుంటుంది అని చెప్పవచ్చు.

నిర్మాతలు కూడా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను భారీ విజువల్స్ తో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.