Begin typing your search above and press return to search.

పుష్ప కి వర్షాకాలం తిప్పలు

ముందుగా అనుకున్న ప్రకారం పుష్ప 2 సినిమా షూటింగ్ నేటి నుంచి పునఃప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ భారీ వర్షం కారణంగా షూటింగ్ ప్రారంభం అవ్వకుండానే క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 July 2023 6:45 AM GMT
పుష్ప కి వర్షాకాలం తిప్పలు
X

అల్లు అర్జున్‌.. సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయి విడుదల కావాల్సి ఉన్నా కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కోసం ఏకంగా ఏడాది సమయం కేటాయించిన దర్శకుడు సుకుమార్‌ షూటింగ్ మొదలు పెట్టి సగానికి పైగా పూర్తి చేశాడు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయిందని తెలుస్తుంది. కథ రీత్యా సినిమా లోని దాదాపు 80 శాతం సన్నివేశాలు ఔట్ డోర్ లో చిత్రీకరించాల్సి ఉందట.

ముందుగా అనుకున్న ప్రకారం పుష్ప 2 సినిమా షూటింగ్ నేటి నుంచి పునఃప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ భారీ వర్షం కారణంగా షూటింగ్ ప్రారంభం అవ్వకుండానే క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. వర్షాకాలం కారణంగా ముందు ముందు కూడా పుష్ప 2 షూటింగ్ కి అడ్డంకులు తప్పక పోవచ్చు అంటూ యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.

పుష్ప 2 సినిమా భారీ యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయినప్పటికి అందుకు సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వర్షం కారణంగా షూటింగ్‌ కి బ్రేక్‌ పడ్డ విషయం తెల్సిందే. ఔట్ డోర్‌ షూటింగ్ ఎక్కువగా చేయాల్సిన సినిమాలు ఇలా వర్షాల కారణంగా క్యాన్సిల్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది.

ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది లో ఈ సినిమా విడుదల లేనట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెల్లగా.. తాపీగా షూటింగ్ ను చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో వర్షాలను చిత్ర యూనిట్ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.