Begin typing your search above and press return to search.

పుష్ప 2 షూటింగ్.. ఎక్కడివరకు వచ్చిందంటే?

ప్రస్తుతం హైదరాబాదులోనే ఈ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. నిన్న ఖైరతాబాద్ లోని ఒక కాలేజీలో కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 10:11 AM GMT
పుష్ప 2 షూటింగ్.. ఎక్కడివరకు వచ్చిందంటే?
X

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఇటీవల బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా రావడంతో ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అయితే మరింత కష్టపడుతున్నాడు.

ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. తప్పకుండా సినిమా అయితే ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ స్థాయిలోనే ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు. సినిమా షూటింగ్ విషయంలో అయితే చిత్ర యూనిట్ పెద్దగా అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. ఇక లేటెస్ట్ గా చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాదులోనే ఈ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. నిన్న ఖైరతాబాద్ లోని ఒక కాలేజీలో కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత వచ్చేవారం ఒక సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారు వచ్చే ఏడాది సమ్మర్ లోపు షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను 2024 ఆగస్టు 15న విడుదల చేయాలని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి అసలు జరగకూడదు అని సుకుమార్ ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉన్నాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రమోషన్స్ కోసం కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నారు. పుష్ప 1 రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ కు ఎక్కువగా సమయం దొరకలేదు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ చేశాడు.

ఇక ఈసారి సుకుమార్ కూడా నిర్మాతలతో కలిసి మిగతా భాషల్లో సినిమాపై హైప్ పెంచే విధంగా ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి పుష్ప సెకండ్ పార్ట్ తో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవాలి అని దర్శకుడు సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఇంపాక్ట్ చూపిస్తుందో లేదో చూడాలి.