Begin typing your search above and press return to search.

ఫిల్మ్‌ సిటీలో పుష్ప ఏం చేస్తున్నాడు..?

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:01 AM GMT
ఫిల్మ్‌ సిటీలో పుష్ప ఏం చేస్తున్నాడు..?
X

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు నమోదు చేసింది. దాంతో పుష్ప 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సుకుమార్‌ పుష్ప 2 ని రూపొందిస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

గత రెండేళ్లుగా పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు లో సినిమా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల సినిమా ఆగస్టు లో ఉండక పోవచ్చు, డిసెంబర్‌ కి వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ వార్తలు నిజం కాదంటూ ఆగస్టు లోనే విడుదల అని 200 రోజుల కౌంట్‌ డౌన్ అంటూ పోస్టర్ సోషల్‌ మీడియా ద్వారా విడుదల అయ్యింది.

ఆగస్టు లో విడుదల కోసం దర్శకుడు సుకుమార్‌ చకచక సినిమా షూటింగ్‌ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో కీలక తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇదే షెడ్యూల్‌ లో ఒక భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించేందుకు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది.

తాజా షెడ్యూల్‌ లో హీరోయిన్‌ రష్మిక మందన్న తో పాటు ఫాహద్‌ ఫాసిల్‌ మరియు ఇతర నటీ నటులు పాల్గొంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. సుకుమార్‌ సొంత బ్యానర్‌ లో మైత్రి మూవీ మేకర్స్ వారితో కలిసి సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

పుష్ప సినిమాలో బన్నీ నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు సొంతం అయ్యింది. జాతీయ స్థాయిలో పుష్ప సినిమాకు వచ్చిన గుర్తింపు కారణంగా పుష్ప 2 కి ఉత్తర భారతంలో విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకే అక్కడ భారీ ఎత్తున బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. బాలీవుడ్ ముద్దుగుమ్మతో ఐటం సాంగ్‌ చేయించే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది.