Begin typing your search above and press return to search.

పుష్ప 2: శివాజీ ఫార్ములా అంటున్నారే..

పుష్పకి సీక్వెల్ గా సిద్ధం అవుతూ ఉండటంతో సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 Feb 2024 5:47 AM GMT
పుష్ప 2: శివాజీ ఫార్ములా అంటున్నారే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలని డైరెక్టర్ షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుష్పకి సీక్వెల్ గా సిద్ధం అవుతూ ఉండటంతో సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా పుష్ప 2కి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ మూవీపైన హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ డీల్స్ కూడా జరుగుతున్నాయి. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు.

దీంతో పుష్ప 2 కూడా అవార్డ్స్ పరంగా సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పైన కూడా ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంటరెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. పుష్ప సినిమా కథ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ తరహాలో లైన్ లో ఉంటుందంట. థీమ్ వేరైనా దాదాపు అదే ఫార్ములా అని టాక్ మొదలయ్యింది.

ఆ సినిమాలో ప్రజలకి సేవ చేద్దామని వచ్చిన ఎన్నారైగా సూపర్ స్టార్ కనిపిస్తాడు. అయితే రాజకీయ కుట్రలతో అతన్ని జైలుకి పంపిస్తారు. జైల్లో రజినీకాంత్ చనిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించి వేషం మార్చి బయటకొచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు. పుష్ప 2లో కూడా అదే తరహాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ కేసులో జైలుకి వెళ్తాడంట. అక్కడి చనిపోయినట్లు అందరిని నమ్మించి బయటకొస్తాడట.

తరువాత స్మగ్లింగ్ కింగ్ తో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు. ప్రజలకి సేవ చేయడమే కాకుండా, విదేశాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చి తనని జైలుకి పంపించిన వారిపైన రివీజ్ తీర్చుకుంటాడంట. ఇంచుమించు శివాజీ లైన్ లోనే పుష్ప 2ని సుకుమార్ నేరేట్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అంతకు మించి పుష్ప రాజ్ ఎలివేషన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.