Begin typing your search above and press return to search.

పుష్ప 2 రిలీజ్ వాయిదా- బన్నీ టీమ్ ఏం చెప్పిందంటే?

దీంతో పుష్ప 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   26 Jan 2024 12:36 PM GMT
పుష్ప 2 రిలీజ్ వాయిదా- బన్నీ టీమ్ ఏం చెప్పిందంటే?
X

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. తగ్గేదేలే అంటూ ఎక్కడా తగ్గకుండా తన సత్తాను పాన్ ఇండియా స్థాయిలో చాటారు. పుష్ప పాటల్ని ప్రపంచమంతా మోగించారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు కలగా మిగిలిన నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును కూడా తీసుకొచ్చారు బన్నీ. దీంతో పుష్ప 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలను పెంచారు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చాలా శాతం షూటింగ్ పూర్తి అయిపోయిందని వార్తలు వచ్చాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇటీవల బన్నీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా పుష్ప 2 షూటింగ్ నుంచే వస్తున్నా అని చెప్పారు.

రష్మిక కూడా ఓ ఇంటర్వ్యూలో.. పుష్ప 2 మొదటి పార్ట్ కంటే గ్రాండ్ గా ఉంటుంది. డ్రామా సీన్స్ కూడా చాలా ఉంటాయి. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా అని చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా కోసం రష్మికను ఎక్స్‌ ట్రా 50 రోజులు షూటింగ్ డేట్స్ అడిగారట. దీంతో పుష్ప 2లో రష్మికకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న తేదీన కాకుండా.. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రానుందని టాక్ నడుస్తోంది. ఆగస్టు 15వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ వాయిదా వేయొద్దని కోరుతున్నారు. ఇప్పటికే సమ్మర్, పొంగల్ మిస్ అయ్యామని ఇంకా రిలీజ్ పోస్ట్ పోన్ చేయొద్దని చెబుతున్నారు.

ఇక పుష్ప-2 పోస్ట్ పోన్ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ స్పందించింది. ఈ మూవీ విడుదల తేదీలో ఇలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చింది. ముందుగానే చెప్పినట్లు ఆగస్టు 15వ తేదీకే థియేటర్లలోకి సినిమా రానుందని చెప్పింది. రిలీజ్ కు ఇంకా ఆరు నెలల టైమ్ ఉందని స్పష్టం చేసింది. ఈ 180 రోజుల్లో షూట్ పూర్తవ్వడానికి 100 రోజులు చాలని చెప్పింది. అన్ని పనులు పూర్తి చేసుకుని జులై నాటికి ఫస్ట్ కాపీని మేకర్స్ సిద్ధం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపింది.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాదే ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను సుమారు రూ.100 కోట్లు వెచ్చించి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.