Begin typing your search above and press return to search.

'పుష్ప2' వాయిదా గోల.. ఇది అసలు మ్యాటర్

సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తోంది. నిజానికి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే తో పాటు లాంగ్ వీకెండ్ కావడంతో పుష్ప 2 రిలీజ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 12:06 PM GMT
పుష్ప2 వాయిదా గోల.. ఇది అసలు మ్యాటర్
X

2024 లో రిలీజ్ కాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో 'పుష్ప: ది రూల్' కూడా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్ట్-1 ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో పార్ట్-2 పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. కేవలం తెలుగులోనే కాదు అన్ని ప్రాంతీయ భాషల ఆడియన్స్ 'పుష్ప2' కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిన్న న్యూ ఇయర్ రోజు కూడా పోస్టర్ రిలీజ్ చేసి మరోసారి అదే డేట్ ని కన్ఫర్మ్ చేశారు. ఇంతలోనే ఈ సినిమా రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అయినట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే చర్చ నడుస్తోంది. నిజానికి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే తో పాటు లాంగ్ వీకెండ్ కావడంతో పుష్ప 2 రిలీజ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు.

కానీ ఇప్పుడేమో సినిమా రిలీజ్ వాయిదా పడిందనే వార్త తెరపైకి వచ్చింది. అందుకు కారణం ఓ హిందీ సినిమా అని అంటున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 తో పాటూ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ 'సింగం అగైన్' మూవీ సైతం రిలీజ్ కాబోతోంది. పుష్ప సినిమా తెలుగు కంటే హిందీ బెల్ట్ లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. నార్త్ లోను 'పుష్ప2' పై భారీ అంచనా నెలకొన్నాయి. ఇప్పుడు సేమ్ డేట్ కి బాలీవుడ్ మూవీ సింగం అగైన్ రిలీజ్ ఉండడంతో పుష్ప 2 కి నార్త్ లో అనుకున్నంత ఓపెనింగ్స్ దక్కడం కష్టం.

ఎందుకంటే సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు దీపికా పదుకొనే, రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనాకపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ లాంటి అగ్రతారలు కూడా నటిస్తున్నారు. దాంతో నార్త్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు ఒకేరోజు రిలీజ్ అయితే కలెక్షన్స్ పై ప్రభావం కచ్చితంగా పడుతుంది. పుష్ప2 ని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో హిందీలోనే కాదు మిగతా భాషలైన తమిళ్, కన్నడ, మలయాళం లోనూ సోలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారట.

అందుకే పుష్ప2 రిలీజ్ డేట్ ని మరోసారి వాయిదా వేసినట్లు టాక్ నడుస్తోంది. కానీ ఈ వర్గాల్లో ఎలాంటి వాస్తవం లేదట. 'పుష్ప 2' రిలీజ్ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మూవీ టీం కొట్టి పారేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నే 'పుష్ప2' ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్సయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే సింగం నిర్మాతలు రిలీజ్ డేట్ ని మారుస్తారా? లేదా 'పుష్ప 2'కి పోటీగా విడుదల చేస్తారా? అనేది చూడాలి.