Begin typing your search above and press return to search.

పుష్ప 2: గోల్డెన్ డేట్.. దున్నుకోవడమే..

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీ ని వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 7:04 AM GMT
పుష్ప 2: గోల్డెన్ డేట్.. దున్నుకోవడమే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా పుష్ప2. మొదటి భాగం ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దీంతో, రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ ఇంతలా ఆకట్టుకుంది అంటే, పుష్ప ది రూల్ ఇంకెంత అదిరిపోతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే, అప్పుడెప్పుడో ఓ చిన్న వీడియో , మధ్యలో ఓ పోస్టర్ తప్ప పుష్ప నుంచి పెద్దగా అప్ డేట్ రాలేదు.

అయితే, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీ ని వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మామూలుగానే ఏ నిర్మాత అయినా, తమ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తే తమకు అనువుగా ఉంటుందా అని చూసుకొని, రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంటారు. పుష్ప మేకర్స్ అయితే, రిలీజ్ డేట్ ని గోల్డెన్ టైమ్ లో ఫిక్స్ చేశారు.

మార్చి 22 శుక్రవారం వచ్చింది. ఆ తర్వాత వీకెండ్ మూవీకి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే హోలీ, ఆ తర్వాత వెంటనే గుడ్ ఫ్రైడ్ వరసగా వస్తున్నాయి. ఇవి సెలవు దినాలు అవ్వడంతో మూవీకి ప్లస్ అవుతాయి. అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత మళ్లీ వీకెండ్ ఉంది. వెంట వెంటనే రెండు, మూడు రోజుల గ్యాప్ లో ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి వంటి పండగలు క్యూలో ఉన్నాయి.

ఈ మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈ అన్ని పంగలను కలిపి, సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయమని తెలుస్తోంది. ఒక్కసారి మూవీ బాగుంది అని టాక్ వస్తే, మన వాళ్లు చూడకుండా వదిలిపెట్టారు. అందులోనూ వరసగా పండగలు ఉండటం సినిమాకి అదనపు బెనిఫిట్ గా మారనుంది.

మరి మొదటి భాగంతో అల్లు అర్జున్, సుకుమార్ లు చేసిన మ్యాజిక్ రెండో భాగంలో రిపీట్ అవుతుందో లేక, మరింత డబల్ అవుతుందో చూడాలి. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.