Begin typing your search above and press return to search.

పుష్ప 2… ఎప్పుడు చూసినా ఇదేనా?

ప్రతిసారి ఈ గంగమ్మ జాతరతో రిలేట్ అయ్యి ఉన్న పోస్టర్స్ వదిలితే అది సినిమాపై రొటీన్ ఫీలింగ్ కలిగించే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

By:  Tupaki Desk   |   4 April 2024 4:07 AM GMT
పుష్ప 2… ఎప్పుడు చూసినా ఇదేనా?
X

ఒక సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాలంటే ఆ మూవీకి సంబందించిన ఎప్పటిపప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఒక బజ్ క్రియేట్ చేయాలి. అలాగే టీజర్, ట్రైలర్ తో వైబ్ జెనరేట్ చేయాలి. మేకర్స్ సినిమాపై క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్ మూవీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. మొదటి రోజు ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్ కి రావడంలో, అడ్వాన్స్ బుకింగ్స్ పెరగడంలో సినిమాపై ఏర్పడిన పాజిటివ్ వైబ్ కారణం అవుతుంది.

ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో చేసే సినిమాలు ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి డిఫరెంట్ కాన్సెప్ట్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్స్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యాయి. పుష్ప ది రూల్ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ తో స్టార్ట్ చేసింది. అసలు పుష్ప ఏమయ్యాడు అనే క్వచ్చన్ తో వీడియో రిలీజ్ చేసి సినిమాపై అటెన్షన్ పెంచారు. అది పబ్లిక్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

తరువాత గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో చీరకట్టుతో గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ స్టిల్ ని విడిచిపెట్టారు. ఈ స్టిల్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ గెటప్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందనే విషయం బయటకొచ్చింది. తరువాత పుష్ప ది రూల్ కి సంబందించిన మరో రెండు అప్డేట్స్ ని చిత్ర యూనిట్ అందించింది. పోస్టర్స్ తో అప్డేట్స్ ఇచ్చారు. ఒక పోస్టర్ తో గాజులు వేసుకొని గంగమ్మ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ చెయ్యి చూపించారు.

తాజాగా టీజర్ అప్డేట్ పోస్టర్ లో జాతరలో కాళ్ళకి గజ్జె కట్టుకొని గంగమ్మ గెటప్ లో డాన్స్ చేస్తోన్న అల్లు అర్జున్ పాదాలని ఎస్టాబ్లిష్ చేస్తూ స్టిల్ రిలీజ్ చేశారు. ఈ స్టిల్ చూడటానికి బాగున్నా కూడా సినిమాలో గంగమ్మ జాతర, గెటప్ తప్ప హైలైట్ సీన్స్ ఏమీ లేవా అనే ప్రశ్న అల్లు అభిమానుల నుంచి వస్తోంది. మూవీపై హైలైట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడానికి చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లేవా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రతిసారి ఈ గంగమ్మ జాతరతో రిలేట్ అయ్యి ఉన్న పోస్టర్స్ వదిలితే అది సినిమాపై రొటీన్ ఫీలింగ్ కలిగించే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ జాతర ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందని టాక్. అలాగే ఒక మిస్టీరియస్ ఫీల్ ని జాతర అట్మాస్పియర్ ఇస్తుందని భావించి పోస్టర్స్ లో ఆ స్టిల్స్ ని హైలైట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మేకర్స్ మిగతా సీన్స్ కు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి.