Begin typing your search above and press return to search.

ఆ రెండింటి వల్ల 'పుష్ప 2' డేట్ ఫిక్స్‌ కాలేదట!

పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా సగం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది

By:  Tupaki Desk   |   2 Aug 2023 3:30 PM GMT
ఆ రెండింటి వల్ల పుష్ప 2 డేట్ ఫిక్స్‌ కాలేదట!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా సగం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఈ ఏడాదిలో విడుదల చేయబోవడం లేదు. మెల్లగా ఈ ఏడాది డిసెంబర్‌ వరకు షూటింగ్ కార్యక్రమాలు చేస్తారాట.

నవంబర్ లేదా డిసెంబర్‌ లో షూటింగ్ కార్యక్రమాలను ముగించడం ద్వారా వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వక పోవడంకు చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌', ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాలు అడ్డుగా ఉండటం అంటున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఎన్టీఆర్‌ దేవర సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలతో క్లాష్ లేకుండా పుష్ప 2 ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆ ఇద్దరు కూడా పాన్‌ ఇండియా స్టార్స్‌ అవ్వడం వల్ల వారితో పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా నష్టం తప్పదు అన్నట్లుగా సుక్కు అండ్‌ టీమ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పుష్ప 2 రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

సంక్రాంతికి ఎలాగూ పుష్ప 2 విడుదల సాధ్యం కాదు. దేవరకి ముందు రావాలంటే ఫిబ్రవరి లేదా మార్చిలో రావాల్సి ఉంటుంది. ఆ రెండు నెలలు కూడా అన్‌ సీజన్. కనుక ఏప్రిల్‌ చివరి వారం లేదా మే లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఒక వేళ ఆ రెండు సినిమా ల్లో ఏదో ఒకటి విడుదల వాయిదా పడటం లేదా క్యాన్సల్‌ అవ్వడం జరిగితే అప్పుడు ఆ తేదీ లో పుష్ప 2 వచ్చే అవకాశం ఉంది. వెయ్యి కోట్ల టార్గెట్ తో పుష్ప 2 ను రూపొందిస్తున్నారు. అందుకే ప్రతి విషయం లో కూడా లోతైన శ్రద్ద అవసరం అన్నట్లుగా సుకుమార్‌ టీం భావిస్తున్నారు.