Begin typing your search above and press return to search.

పుష్ప 2.. నార్త్ లో ఇక దున్నుకోవడమే..

సౌత్ ఇండియా నుంచి వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలకి నార్త్ ఇండియాలో కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 April 2024 10:53 AM GMT
పుష్ప 2.. నార్త్ లో ఇక దున్నుకోవడమే..
X

సౌత్ ఇండియా నుంచి వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాలకి నార్త్ ఇండియాలో కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. సౌత్ సినిమాల పట్ల హిందీ ఆడియన్స్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అక్కడి డిస్టిబ్యూటర్స్ కూడా సౌత్ సినిమాలకి సంబంధించి హిందీ డబ్బింగ్ రిలీజ్ రైట్స్ ని భారీ ధరకి సొంతం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సౌత్ నుంచి మరీ ముఖ్యంగా తెలుగు నుంచి అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

వాటిలో నార్త్ ఇండియాలో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమా అంటే పుష్ప ది రూల్ అని చెప్పాలి. పుష్ప సినిమా హిందీలో వందల కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి పుష్ప మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యింది. దీంతో పుష్ప ది రూల్ పైన కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 100 కోట్లకి కొనుగోలు చేసిందని టాక్ వస్తోంది.

హిందీ శాటిలైట్ రైట్స్ ని టి-సిరీస్ 60 కోట్లకి దక్కించకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూవీ మీద ఉన్న అంచనాల నేపథ్యంలో ఫస్ట్ డే హిందీ బెల్ట్ లో పుష్ప ది రూల్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. సౌత్ సినిమాలు హిందీ బెల్ట్ లో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు అంటే టాప్ వన్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఈ మూవీ ఏకంగా 52.39 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

టాప్ 2 లో బాహుబలి 2 నిలిచింది. ఈ సినిమా 40.73 కోట్లు వసూళ్లు చేసింది. ప్రభాస్ సాహో మూవీ 25.82 కోట్లు మొదటి రోజు రాబట్టింది. రోబో 2.ఓ మూవీ 19.74 కోట్లు కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాకి వచ్చింది. ఐకాన్ స్టార్ ఫ్యాన్ బేస్, పుష్ప ది రూల్ సినిమాపై ఉన్న హైప్ తో కచ్చితంగా నార్త్ ఇండియాలో 60 కోట్లకి పైగా మొదటి రోజు ఈ చిత్రానికి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పుష్ప ది రూల్ రిలీజ్ అయ్యే టైమ్ లో (ఆగష్టు 15న) అజయ్ దేవగన్ సింగం ఎగైన్ మూవీ ఉంటుందని టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప ది రూల్ కి ఆ రోజు పోటీగా ఎలాంటి హిందీ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. దీంతో చిత్ర యూనిట్ కూడా నార్త్ ఇండియాలో పుష్ప ది రూల్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.